RSS

మరింత పకడ్బందీగా ఇంటర్‌ జంబ్లింగ్‌

12 Dec

ఈనాడు, హైదరాబాద్‌ : ఇంటర్‌ పరీక్షల జంబ్లింగ్‌ విధానం అమల్లో కార్పొరేట్‌ కళాశాలలకు కొంత వెసులుబాటు ఇస్తున్నారనే ఆరోపణలు రావడంతో మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఈ క్రమంలో రాజధాని నగరంలో ఇంటర్‌ పర్యవేక్షణ అధికారులు(ఆర్‌ఐఓలు) వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో ప్రతిఏటా 170 పరీక్షా కేందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక కళాశాల విద్యార్థులను నాలుగైదు ఇతర కళాశాలల్లో పరీక్షలు రాసేలా జంబ్లింగ్‌ విధానం పాటిస్తున్నారు. కొన్నిచోట్ల కళాశాలలు దూరం ఉంటే ఒకటీ, రెండు కళాశాలలకే పరిమితం చేస్తున్నారు. కార్పొరేట్‌ కళాశాలల విషయంలో జంబ్లింగ్‌ సరిగా జరగడం లేదన్న ఆరోపణలు రావడంతో ఈ ఏడాది మరింత పకడ్బందీగా చేయాలని ఇంటర్‌ బోర్డు జిల్లా అధికారులను ఆదేశించింది. ఏ ప్రాంతంలో ఎన్ని కళాశాలలున్నాయి, ఎంత దూరంలో ఉన్నాయో వివరాలు సేకరిస్తున్నారు. కార్పొరేట్‌ కళాశాల విద్యార్థులను కనీసం నాలుగైదు కళాశాలల్లో పరీక్ష రాసేలా చర్యలు తీసుకుంటున్నారు.

 
Comments Off on మరింత పకడ్బందీగా ఇంటర్‌ జంబ్లింగ్‌

Posted by on December 12, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: