RSS

Daily Archives: December 14, 2013

సైన్స్ అభివృద్ధికి ఆర్థిక సహకారం పెరగాలి


సైన్స్ అభివృద్ధికి ఆర్థిక సహకారం పెరగాలి

* భారతరత్న సి.ఎన్.ఆర్.రావు
న్యూఢిల్లీ: దేశంలో సైన్స్ అభివృద్ధికి ఆర్థిక తోడ్పాటు తగిన స్థాయిలో లేదని ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న సి.ఎన్.ఆర్.రావు అన్నారు. మన దేశంలో సైన్స్ అభివృద్ధికి 90 శాతం నిధులు ప్రభుత్వాల నుంచే వస్తున్నాయని… అదే విదేశాల్లో అయితే శాస్త్ర రంగం నుంచీ ఈ దిశగా ఆర్థిక భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. డిసెంబరు 14న ఎన్డీటీవీ నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సైన్స్ పట్ల సమాజం ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. భారత సమాజంలోని విలువల వ్యవస్థలో విజ్ఞానశాస్త్రం చిట్టచివరి స్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే యువత ఉత్సాహంగా ప్రయోగాలు చేసేందుకు వీలుగా భారత్‌లో మరిన్ని సంస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న అయిదేళ్లలో బోధనను జాతీయ కార్యక్రమంగా చేపట్టేలా పథకం రూపకల్పనకు ప్రణాళికా సంఘాన్ని తాను సంప్రదించినట్లు సీఎన్ఆర్ రావు తెలిపారు. కాగా కణజీవశాస్త్రంలో ప్రగతి సాధించేందుకు భారత్ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని జీవశాస్త్రవేత్త వెంకటరామన్ రామకృష్ణన్ అన్నారు. వ్యవసాయ సంబంధిత పరిశోధనల్లో ప్రగతి లేకపోవడంపై ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ విచారం వ్యక్తం చేశారు. మరో హరిత విప్లవం రావాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలోని ఎన్నో సమస్యలకు సాంకేతికత ఉపయోగించి పరిష్కారాలు కనుగొనవచ్చని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ నటరాజన్ చంద్రశేఖరన్ అన్నారు.

Advertisements
 
Comments Off on సైన్స్ అభివృద్ధికి ఆర్థిక సహకారం పెరగాలి

Posted by on December 14, 2013 in Uncategorized

 

వీడియో గేమ్స్‌తో సామాజిక నైపుణ్యాలు


మెల్బోర్న్‌: కొన్ని రకాల వీడియో గేమ్స్‌ ఆడే చిన్నారుల్లో సామాజిక నైపుణ్యాలు మెరుగ్గా ఉంటాయని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. సామాజిక, విద్యా ప్రయోజనాలు కలిగిన గేమ్స్‌ వల్ల చిన్నారుల్లో నైపుణ్యాలు పెరుగుతాయని ఎడిత్‌ కొవాన్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ మార్క్‌ మెక్‌మహోన్‌ పేర్కొన్నారు. వయసు నిబంధనలు, గేమ్స్‌లో ఉన్న భావం (థీమ్‌)కు ఆధారంగా మంచి గేమ్స్‌నే చిన్నారులతో ఆడించాలని సూచించారు. అన్ని రకాల గేమ్స్‌ ఆడించడం సరికాదని తెలిపారు. ఇవి మానసిక వికాసానికి తోడ్పతున్నట్లు 91 శాతం మంది, ఒత్తిడిని తగ్గిస్తున్నట్లు 85 శాతం మంది పేర్కొన్నట్లు డిజిటల్‌ ఆస్ట్రేలియా 2014 నివేదిక తెలిపింది.

 
Comments Off on వీడియో గేమ్స్‌తో సామాజిక నైపుణ్యాలు

Posted by on December 14, 2013 in Uncategorized

 

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ ముందంజ


డీఆర్‌డీఓ డైరెక్టర్‌ జనరల్‌ అవినాష్‌ చందర్‌
ఈనాడు, గుంటూరు: దేశ రక్షణ రంగానికి అవసరమైన యంత్రాలు.. పరికరాల తయారీలో మనమెంతో పురోగతి సాధించామని, ఇదంతా పరిశోధనల వల్లే సాధ్యపడిందని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, డీఆర్‌డీఓ డైరెక్టర్‌ జనరల్‌ అవినాష్‌ చందర్‌ అన్నారు. కేవలం ప్రభుత్వ, పరిశ్రమల అవసరాలకే పరిశోధనలు పరిమితం కారాదని.. వాటి ఫలాలు, ప్రయోజనాలు ప్రజల చెంతకు వెళ్తెనే వాటి ప్రాముఖ్యం జనవాణికి తెలుస్తుందన్నారు. 

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ‘నేవిగేషన్‌ సిస్టమ్స్‌ అండ్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ అప్లికేషన్స్‌’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు డిసెంబరు 13న ప్రారంభమైంది. ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన పలు విశ్వవిద్యాలయాల నుంచి 300కు పైగా పరిశోధన పత్రాలు వచ్చాయి. ఇస్రో, షార్‌, డీఆర్‌డీఓల శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అవినాష్‌చందర్‌ మాట్లాడుతూ మానవ రహిత యుద్ధ విమానాల తయారీలో డీఆర్‌డీఓ విజయవంతంగా ముందుకెళ్తోందని చెప్పారు. రానున్న రెండేళ్లలో ఏడెనిమిది కొత్త క్షిపణులు ప్రవేశపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని అంశాల్లో ఇటలీ, జర్మనీ వంటి దేశాలు భారత్‌ సహకారం తీసుకుంటున్నాయని గుర్తుచేశారు. ఏదైనా వ్యవస్థ విఫలమైనా.. లక్ష్యం మేర పనిచేయకపోయినా దానికి కారణాలేమిటో తెలుసుకోవాలంటే అది విశ్వవిద్యాలయాల్లో, పరిశోధనల ద్వారానే సాధ్యపడుతుందని చెప్పారు. అమెరికాలో నేవిగేషన్‌ సిస్టమ్స్‌ సహకారంతో ప్రజా, జల రవాణా మార్గాల్లో ఏ మారుమూలన అసౌకర్యం ఏర్పడినా వెంటనే తెలుసుకుని చక్కదిద్దగలుగుతున్నారని, ఆ స్థాయిలో మన సాంకేతిక రంగాన్ని బలోపేతం చేసుకోవాల్సి ఉందని డీఆర్‌డీఓ హైదరాబాద్‌ డైరెక్టర్‌ జి.సతీష్‌రెడ్డి అన్నారు. నేవిగేషన్‌ సిస్టమ్స్‌ తయారీలో అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మనం పోటీపడుతున్నామని వివరించారు. సైబర్‌ నేరాలను అరికట్టే ప్రయత్నాలపై పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. షార్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ శేషగిరిరావు మాట్లాడుతూ ఏ దేశానికి అయినా సొంత శాటిలైట్‌ వ్యవస్థ లేకపోతే ఇతర దేశాలు ఏ క్షణంలో అయినా వారి సహకారాన్ని నిలుపుదల చేసే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ నెలాఖరులో శ్రీహరికోటలో పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ వాహనాల ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మరో శాస్త్రవేత్త ప్రహ్లాదరావు మాట్లాడుతూ ప్రస్తుతం మన పీఎస్‌ఎల్‌వీ రాకెట్లకు డిమాండ్‌ బాగా ఉందని, వీటి తయారీకి ఆర్డర్లు బాగా వస్తున్నాయని తెలిపారు. వీసీ కె.వియన్నారావుతో పాటు జేఎన్‌టీయూ(హెచ్‌)వీసీ రామేశ్వరావు పాల్గొన్నారు.

 
Comments Off on శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ ముందంజ

Posted by on December 14, 2013 in Uncategorized

 

LIST OF MODEL SCHOOLS UNDER PHASE 2


LIST OF MODEL SCHOOLS UNDER PHASE 2

 
Comments Off on LIST OF MODEL SCHOOLS UNDER PHASE 2

Posted by on December 14, 2013 in Uncategorized

 

జనవరి 30లోగా వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీ


జనవరి 30లోగా వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీ

ఈనాడు, హైదరాబాద్: వీఆర్వో, వీఆర్ఏ పోస్టులను జనవరి 30లోగా భర్తీ చేయాలని రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అధికారులను డిసెంబరు 13న ఆదేశించారు. రాష్ట్రంలో 1,658 గ్రామరెవెన్యూ అధికారులు (వీఆర్వోలు), 4,305 గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)ను ప్రభుత్వం నియమించనుంది. అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి 2014 జనవరి నెల 30లోగా నియామకపత్రాలు అందించేలా షెడ్యూలును రూపొందించాలని మంత్రి సూచించారు. కాగా, ఈ విషయమై భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ ఐ.వై.ఆర్. కృష్ణారావు శుక్రవారం సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్, ఇతర అధికారులుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారం రోజుల్లో ఉద్యోగ ప్రకటన జారీ చేయాలని యోచిస్తున్నారు. కేవలం రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే ఈ నియామకాలను చేపడతారు. రాతపరీక్ష నిర్వహించే బాధ్యతను జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

 
Comments Off on జనవరి 30లోగా వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీ

Posted by on December 14, 2013 in Uncategorized

 

నెలాఖరులో వీఆర్వో, వీఆర్ఏ నియామకాలకు ప్రకటన


నెలాఖరులో వీఆర్వో, వీఆర్ఏ నియామకాలకు ప్రకటన

* పోస్టుల భర్తీకి షెడ్యూలు రూపొందించాలి
* మంత్రి రఘువీరా
ఈనాడు, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏలు) నియామకాలకు సంబంధించి షెడ్యూలును రూపొందించాలని రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఆదేశించారు. ఉద్యోగ నియామక ప్రకటన, రాత పరీక్ష తేదీ, ఫలితాలు, నియామక ఉత్తర్వులు…. తదితర కీలకాంశాలకు సంబంధించిన తేదీలను నిర్ణయించాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. మంత్రి రఘువీరా డిసెంబరు 12న భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఐ.వై.ఆర్.కృష్ణారావు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనాలతో సమావేశమయ్యారు. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టి పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. డిసెంబరు నెలాఖరులోపు ఉద్యోగ ప్రకటన వెలువరిస్తే దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు గరిష్ట వయోపరిమితి 36 ఏళ్ల వరకూ ఉంటుందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని షెడ్యూలును సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఎక్కువ మంది నిరుద్యోగులకు అవకాశం లభించేలా ఉద్యోగ ప్రకటనను వెల్లడించేలా చర్యలు చేపట్టాలన్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 34 ఏళ్ల వయోపరిమితి ఉండగా మరో రెండేళ్లను అంటే 36 ఏళ్ల వరకూ అనుమతిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రత్యేక ఉత్తర్వుల గడువు డిసెంబరు 31వ తేదీతో ముగియనుంది.

 
Comments Off on నెలాఖరులో వీఆర్వో, వీఆర్ఏ నియామకాలకు ప్రకటన

Posted by on December 14, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: