RSS

Daily Archives: December 17, 2013

Intermediate_Exam_TimeTable


Intermediate_Exam_TimeTable2014

 
Comments Off on Intermediate_Exam_TimeTable

Posted by on December 17, 2013 in Uncategorized

 

రెండు మూడు వీఆర్‌వో పోస్టుల భర్తీ షెడ్యులు


హైదరాబాద్: రెవిన్యూ శాఖ త్వరలో జారీ చేయనున్న గ్రామ రెవిన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవిన్యూ సహాయకుల (వీఆర్ఏ)ల ఉద్యోగ ప్రకటనపై ఆ శాఖ కసరత్తు చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల నియామకం పూర్తయ్యేలా ఉద్యోగ ప్రకటన వెలువర్చేందుకు వీలుగా తేదీలను నిర్ణయించే అంశంపై డిసెంబరు 17న చర్చించారు. రెవిన్యూమంత్రి రఘువీరారెడ్డి భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ ఐ.వై.ఆర్.కృష్ణారావు, ఇతర అధికారులతో చర్చించారు. రెండు మూడు రోజుల్లో షెడ్యులు ఖరారు చేయాలని మంత్రి సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో కూడా చర్చించి త్వరలో ఉద్యోగ ప్రకటన, దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక పరీక్ష తేదీలను నిర్ణయించనున్నారు.

 
Comments Off on రెండు మూడు వీఆర్‌వో పోస్టుల భర్తీ షెడ్యులు

Posted by on December 17, 2013 in Uncategorized

 

ఉద్యోగం వయా ఫేస్‌బుక్!


న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమంలో చురుగ్గా ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని డిసెంబరు 17న తాజా సర్వే ఒకటి వెల్లడించింది. సామాజిక అనుసంధాన వేదికల ద్వారా 56 శాతం మంది ఉద్యోగ అవకాశాలు, వాటికి సంబంధించిన సమాచారాన్ని పొందుతున్నారని కెల్లీ సర్వీసెస్ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఉద్యోగ అన్వేషణకు సామాజిక సైట్లు చాలా బాగా ఉపయోగపడుతున్నట్లు 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆసియాపసిఫిక్ ప్రాంతంలో ఇండోనేసియా, థాయ్‌లాండ్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ దేశాల్లో 38 శాతం మంది సామాజిక మాధ్యమం ద్వారా ఉద్యోగాలు పొందుతున్నారు. వీటి తర్వాతి స్థానంలో భారత్ (5వ స్థానం), సింగపూర్ (6), హాంగ్‌కాంగ్ (7), న్యూజిలాండ్ (8), అస్ట్రేలియా (9) ఉన్నాయి.

 
Comments Off on ఉద్యోగం వయా ఫేస్‌బుక్!

Posted by on December 17, 2013 in Uncategorized

 

గురుకుల భవనాల నిర్మాణానికి నిధులు


ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడు సాంఘిక సంక్షేమ గురుకుల భవనాల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం డిసెంబరు 17న ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో భవనాన్ని రూ. 13 కోట్లతో నిర్మించాలని ఆదేశించింది. గుంటూరు జిల్లా రేపల్లె, కాకుమాను, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, ప్రకాశం జిల్లా సింగరాయకొండ, చిత్తూరు జిల్లా వాల్మీకిపురం, నెల్లూరు జిల్లా అదురుపల్లిలో వీటిని నిర్మిస్తారు.
* మెదక్ జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్
….
అలాగే మెదక్‌లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి రూ. 2.20 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించినట్లు పేర్కొంది.

 
Comments Off on గురుకుల భవనాల నిర్మాణానికి నిధులు

Posted by on December 17, 2013 in Uncategorized

 

ఆన్‌లైన్ పోటీలో మెరిసిన భారత విద్యార్థి


మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య అభ్యసిస్తే కలిగే ప్రయోజనాలపై డిజిటల్ పోస్ట్ కార్డ్ రూపొందించే పోటీలో భారత విద్యార్థి విజేతగా నిలిచాడు. ఈ ఆన్‌లైన్ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా 37000 మంది పాల్గొనగా.. చివరకు ఐఐటీ-ఢిల్లీ విద్యార్థి ఉత్తమ్ కుమార్‌ను విజేతగా ఎంపిక చేశారు. మొదటి బహుమతిలో భాగంగా కుమార్‌కి ఉచితంగా ఆస్ట్రేలియాలో చదువుకొనే అవకాశం కల్పిస్తారు. ఇందుకు అయ్యే ఇతర ఖర్చులనూ అక్కడి ప్రభుత్వమే భరిస్తుంది. సిడ్నీలో డిసెంబరు 17న జరిగిన ఒక కార్యక్రమంలో కుమార్ బహుమతిని అందుకున్నారు.

 
Comments Off on ఆన్‌లైన్ పోటీలో మెరిసిన భారత విద్యార్థి

Posted by on December 17, 2013 in Uncategorized

 

అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది * డీఆర్‌డీవో ముఖ్య అధికారి అవినాశ్‌చందర్‌ వెల్లడి


  అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది
* డీఆర్‌డీవో ముఖ్య అధికారి అవినాశ్‌చందర్‌ వెల్లడి

ఈనాడు – అనంతపురం: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న ప్రపంచ దేశాలకు దీటుగా భారత్‌ సత్తా చాటడం హర్షించదగిన పరిణామమని రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు, డీఆర్‌డీవో ముఖ్యఅధికారి ఎ.అవినాశ్‌ చందర్‌ అభిప్రాయపడ్డారు.

డిసెంబరు 16న ఆయన అనంతపురం జేఎన్‌టీయూలో జరిగిన 5వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై, విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. విశ్వాంతరాళంలో వైమానిక ప్రగతి ద్వారా విప్లవాత్మకమైన మార్పులు సృష్టించే దిశగా పలు దేశాలు పోటీపడుతున్నాయని.. అందులో భారత్‌ సైతం ముందడుగేస్తోందన్నారు. భూ ఉపగ్రహాల నుంచి అరిహంత్‌ వంటి అణు జలాంతర్గాముల వరకు ఆధునిక యుద్ధట్యాంకులు, క్షిపణుల నుంచి యుద్ధ విమానాల వరకు అన్నింటా స్వదేశీ పరిజ్ఞానం పరిఢవిల్లుతోందని ఆనందం వ్యక్తం చేశారు. విజ్ఞాన నిలయాలైన విశ్వవిద్యాలయాల్లో దేశరక్షణ, భద్రతకు సంబంధించిన నూతన ఆవిష్కరణలు జరగాల్సి ఉందన్నారు. డీఆర్‌డీవో ఆర్‌అండ్‌డి విభాగం విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు సమకూర్చడం ద్వారా ప్రగతి సాధించేందుకు పనిచేస్తోందని చెప్పారు. సామాన్యుడికి సైతం ఉపయోగపడే పరిశోధనలు జరగాలన్న ఆయన.. ప్రతిభావంతమైన పరిశోధనలతో ఇప్పటికే ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందినట్లు చెప్పారు. స్థానిక సాంకేతిక అవసరాలు తీర్చి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి చూపే కారకాలుగా విశ్వవిద్యాలయాలు మారాలన్నారు. అనంతరం 29 మంది విద్యార్థులకు స్వర్ణపతకాలు, పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ వీసీ లాల్‌కిషోర్‌, రిజిస్ట్రార్‌ హేమచంద్రారెడ్డి, రెక్టార్‌ సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు.

 
Comments Off on అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది * డీఆర్‌డీవో ముఖ్య అధికారి అవినాశ్‌చందర్‌ వెల్లడి

Posted by on December 17, 2013 in Uncategorized

 

ట్రిపుల్‌ఐటీలో ప్రాంగణ ఎంపికలు


ట్రిపుల్‌ఐటీలో ప్రాంగణ ఎంపికలు

* 18, 19న ప్రముఖ కంపెనీలు రాక
క‌డ‌ప‌ (వేంపల్లె), న్యూస్‌టుడే : ట్రిపుల్‌ఐటీ ప్రాంగణ ఎంపికలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ4 చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు కంపెనీలు ముఖాముఖి నిర్వహించేందుకు ఇక్కడికి వస్తున్నాయి. డిసెంబ‌రు 18, 19న ఇన్ఫోసిస్‌ కంపెనీ, జనవరిలో టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధులు తరలిరానున్నారు. విద్యార్థుల‌కు ఉద్యోగాలు కల్పించేందుకు యాజమాన్యం ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరిపింది.

 
Comments Off on ట్రిపుల్‌ఐటీలో ప్రాంగణ ఎంపికలు

Posted by on December 17, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: