RSS

పదేళ్ల వరకు సమాన అవకాశాలు

17 Dec

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను సమానస్థాయిలో అందించేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న ప్రవేశాల కోటాను పదేళ్లకు మించకుండా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013లో పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ముసాయిదాలో కాలపరిమితి ఐదేళ్లకు మించకుండా కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర శాసనసభకు వచ్చిన బిల్లులో మాత్రం కాలపరిమితి పదేళ్లకు మించకుండా అని ఉంది. రెండు రాష్ట్రాల వారికీ ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌, ఉన్నత, సాంకేతిక, వైద్యవిద్యలో ప్రస్తుతం ఉన్న ప్రవేశాల కోటా పదేళ్లకు మించకుండా కొనసాగించాలని తెలిపారు. ఈ వ్యవధిలో ప్రస్తుతం ఉన్న ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియనే కొనసాగించాలని పేర్కొన్నారు.

 
Comments Off on పదేళ్ల వరకు సమాన అవకాశాలు

Posted by on December 17, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: