RSS

Daily Archives: December 20, 2013

టెట్, డీఎస్సీ’లకు సీఎం నిర్ణయమే ఆధారం!


‘టెట్, డీఎస్సీ’లకు సీఎం నిర్ణయమే ఆధారం!

ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణ, డీఎస్సీ (ఉపాధ్యాయ పోస్టుల భర్తీ) ప్రకటనల జారీపై ముఖ్యమంత్రి కార్యాలయం అభిప్రాయాన్ని కోరుతూ మాధ్యమిక విద్యా శాఖ డిసెంబరు 20న లేఖ రాసింది. అక్కడి నుంచి వచ్చే స్పందననుబట్టి తమ చర్యలు ఉంటాయని విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ లేఖపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించాకే నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు. టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. ఆరోజు నుంచి 30 రోజుల వరకు సమయం తీసుకుంటామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. టెట్ నిర్వహణపై తీసుకునే నిర్ణయాన్నే అనుసరించి డీఎస్సీ ప్రకటన జారీపైనా సీఎం కార్యాలయం నుంచి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

Advertisements
 
Comments Off on టెట్, డీఎస్సీ’లకు సీఎం నిర్ణయమే ఆధారం!

Posted by on December 20, 2013 in Uncategorized

 

Todays Video conference


Todays Video conference
same old CD has played by Vani mohan regarding Status of the building,furniture,MDM ,outsource staff.the only interesting thing is that they are working on service rules and she has not even mentioned when are we going to expect that to out.soon we may get around 200 PGT Telugu staff.we need to send the vacancy position of staff in each and every school,though it has already been sent many a times.Mr.Satyanarayana  said that we need to care about our Pay Bills to reach RMSA office by 20th or 21st of every month.so that we can expect our salaries in the first week of every month.we will get separate fund to buy a computer and other accessories within a month or two.we must concentrate on quality education especially in English.soon they are going to call for the tenders for the construction of 2nd Phase Model schools.

 
1 Comment

Posted by on December 20, 2013 in Uncategorized

 

విద్యార్థులకు కొత్త కోర్సులపై అవగాహనకు ‘ఫిట్జీ’ పరీక్ష


హైదరాబాద్‌: తొమ్మిది నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం వరకూ చదివే విద్యార్థులు తమ భవిష్యత్తు చదువులను ఎంపిక చేసుకోవడం కోసం ఎస్కేప్‌ వెలాసిటీ పేరుతో వినూత్నమైన పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రముఖ విద్యాసంస్థ ఫిట్జీ డిసెంబరు 20న ప్రకటించింది. యూఎస్‌ఏ యూనిక్వెస్ట్‌, ఫిట్జీ సంయుక్తంగా చేపడుతున్న ఈ పరీక్షకు విద్యార్థులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా హాజరుకావచ్చునని ఫిట్జీ హైదరాబాద్‌ శాఖ సంచాలకుడు ఆనందరామన్‌ తెలిపారు. మూడు భాగాలుగా జరిగే ఈ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు కేవలం ఇంజినీరింగ్‌, మెడిసిన్‌లనే కాకుండా ఇతర రంగాల్లో ఉన్న అవకాశాలను సైతం తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు జనవరి 2 లోపు రిజిస్టర్‌ చేసుకుంటే అదే నెల 4 నుంచి 10 పరీక్ష రాసే అవకాశం ఉంటుందని ఆనంద రామన్‌ చెప్పారు. దీనికి ఏవిధమైన రుసుమూ చెల్లించనవసరం లేదన్నారు.

 
Comments Off on విద్యార్థులకు కొత్త కోర్సులపై అవగాహనకు ‘ఫిట్జీ’ పరీక్ష

Posted by on December 20, 2013 in Uncategorized

 

నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ ఇక కష్టతరం


నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ ఇక కష్టతరం

* ఫలితం ఆధారిత చదువు ప్రాతిపదికన మంజూరు
ఈనాడు, హైదరాబాద్: ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు ‘నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ) మంజూరు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. ప్రస్తుతం కోర్సుల వారీగా కళాశాలలు సాధించిన ప్రగతిని అనుసరించి సాంకేతిక విద్యకు సంబంధించిన ఎన్‌బీఏ అధికారులు ఈ గుర్తింపు మంజూరు చేస్తున్నారు. ప్రపంచస్థాయిలో ఇంజినీరింగ్ విద్యకు తగిన గుర్తింపు కావాలన్న ఉద్దేశంతో ఎన్‌బీఏ అధికారులు ‘ఫలితం ఆధారిత చదువు (అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్) విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుత విధానంలో కేవలం కళాశాలలో సదుపాయాలు పరిశీలించి ఎన్‌బీఏ అక్రిడిటేషన్ ఇస్తున్నారు. కొత్త విధానం ప్రకారం… ఇంజినీరింగ్ తర్వాత ఫలితమెలా ఉందో చూస్తారు. అంటే చదువు పూర్తి చేసిన విద్యార్థి ఏం సాధించాడు.. విద్యాలక్ష్యం ఎంతవరకు నెరవేరిందన్నది పరిశీలిస్తారు. ఎన్‌బీఏ గుర్తింపునిచ్చేముందు ఇకనుంచి ఈ అంశాలన్నీ పరిగణనలోనికి తీసుకుంటారు. ఈ దిశగా సన్నద్ధమయ్యేందుకు పలు విశ్వవిద్యాలయాలు ఇప్పటికే మార్పులు చేసుకుంటున్నాయి. ఇలాంటి 11 లక్ష్యాలను సాధించేలా ఈ విద్యాసంవత్సరం నుంచి జేఎన్‌టీయూ హైదరాబాద్, కాకినాడ, అనంతపురం పరిధిల్లో సిలబస్ మార్చారు.
* అబెట్ నిబంధనల ప్రకారమే..

– ఆచార్య జీకే విశ్వనాథ్, అకడమిక్ అండ్ ప్లానింగ్ సెల్ సంచాలకుడు, జేఎన్‌టీయూహెచ్
 
Comments Off on నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ ఇక కష్టతరం

Posted by on December 20, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: