RSS

Daily Archives: December 21, 2013

విద్య, ఉద్యోగ సమాచారం కౌన్సెలర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం


రంగారెడ్డి: జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ సంస్థలో ఏడాది కాలానికి కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న కౌన్సెల‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నట్లు ప‌థ‌క సంచాల‌కులు ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు. లీగ‌ల్‌, సోష‌ల్ విభాగాల్లో చెరో ఒక‌టి చొప్పున మొత్తం రెండు పోస్టులు ఉన్నాయ‌ని చెప్పారు. కౌన్సెల‌ర్ (లీగ‌ల్‌) పోస్టుకు ఎల్ఎల్‌బీ ఏదా బీఎల్‌తో పాటు కనీసం ఐదేళ్లు లాయ‌ర్ గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. కౌన్సెలర్ (సోష‌ల్‌) పోస్టుకు సైకాల‌జీ/ సోష‌ల్‌వ‌ర్క్‌/ సోషియాల‌జీలో పీజీతో పాటు కౌన్పెలింగ్‌లో మూడేళ్ల అనుభ‌వం ఉండాలి. వేత‌నం నెల‌కు రూ.19,000. ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు జిల్లా ప‌థ‌క సంచాల‌కుల కార్యాల‌యం నుంచి ద‌ర‌ఖాస్తులు పొందాల‌ని సూచించారు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను ‘ప‌థ‌క సంచాల‌కులు, జిల్లా స్త్రీ,శిశు సంక్షమ సంస్థ, జ‌ఫారియాగూడ‌, మొఘ‌ల్‌ఖానాలా, ఫ్లాట్ నెం.13-6-826/ఎ/1, పిల్లర్ నెం.106, పి.వి.న‌ర‌సింహారావు ఎక్స్‌ప్రెస్ వే, రంగారెడ్డి’ చిరునామాకు జన‌వ‌రి 3 సాయంత్రం 5 గంట‌ల లోపు పంపాల‌ని తెలిపారు. పూర్తి వివ‌రాల‌కు 040-20023025 ఫోన్ నెంబ‌రులో సంప్రదించ‌వ‌చ్చు.

Advertisements
 
Comments Off on విద్య, ఉద్యోగ సమాచారం కౌన్సెలర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Posted by on December 21, 2013 in Uncategorized

 

విద్య, ఉద్యోగ సమాచారం విదేశాల్లో ఉన్నత చదువులపై ‘ఈనాడు’ విద్యా ప్రదర్శన 22న


మీరు విదేశాల్లో విద్యను అభ్యసించాలని అనుకొంటున్నారా? అక్కడ ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా? ఎలా దరఖాస్తు చేయాలో మీకు సరైన అవగాహన లేదా? మీ సందేహాలను నివృత్తి చేసేందుకు ‘ఈనాడు’ సదవకాశాన్ని కల్పిస్తోంది. ప్రముఖ విదేశీ విద్యా కన్సల్టెంట్లు పాల్గొని మీకు సమాధానాలు చెబుతారు.
తేదీ: డిసెంబరు 22 (ఆదివారం)
సమయం: ఉ. 10 నుంచి సా. 6 గంటల వరకు
వేదిక: స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల, ఆబిడ్స్‌
అందరూ ఆహ్వానితులే.
ప్రవేశం ఉచితం.

 
Comments Off on విద్య, ఉద్యోగ సమాచారం విదేశాల్లో ఉన్నత చదువులపై ‘ఈనాడు’ విద్యా ప్రదర్శన 22న

Posted by on December 21, 2013 in Uncategorized

 

ట్రిపుల్‌ఐటీని సందర్శించిన టెక్‌ మహీంద్రా అధికారులు


బాసర : బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రతిభాన్వేషణ నిమిత్తం తరలివచ్చిన ఐటీ కంపెనీ టెక్‌మహీంద్రా డిసెంబరు 20న విద్యార్థులకు నైపుణ్యతలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించింది. ట్రిపుల్‌ఐటీలో చివరి సంవత్సరం చదువుతున్న మెకానికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లోని 1200 మంది విద్యార్థులకు వివిధ పరీక్షలు నిర్వహించింది. ప్రాంగణ నియామాకాలకు సంబంధించిన ప్రక్రియ రెండురోజుల పాటు సాగనుందని ట్రిపుల్‌ఐటీ ఓఎస్‌డీ నారాయణ తెలిపారు.

 
Comments Off on ట్రిపుల్‌ఐటీని సందర్శించిన టెక్‌ మహీంద్రా అధికారులు

Posted by on December 21, 2013 in Uncategorized

 

వీఆర్‌వో, వీఆర్ఏ రాత‌ప‌రీక్ష ఫిబ్రవ‌రి 2న‌


వీఆర్‌వో, వీఆర్ఏ రాత‌ప‌రీక్ష ఫిబ్రవ‌రి 2న‌

* ఈ నెల 28న నోటిఫికేష‌న్ విడుద‌ల
హైదరాబాద్‌ : వీఆర్‌వో, వీఆర్ఏ రాత‌ప‌రీక్ష వ‌చ్చే ఏడాది ఫిబ్రవ‌రి 2న జ‌ర‌గ‌నుంద‌ని రెవెన్యూ మంత్రి ర‌ఘువీరారెడ్డి తెలిపారు. దీనికి అనుగుణంగా పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన నోటిఫికేష‌న్లను జిల్లా కలెక్టర్లు ఈ నెల 28న జారీ చేస్తార‌ని చెప్పారు. ఈ ప్రక‌ట‌న ద్వారా 1,657 వీఆర్‌వో, 4,305 వీఆర్‌ఏ పోస్టులను భర్తీ చేస్తారని, ఫిబ్రవ‌రి నెలాఖ‌రుకు భర్తీ ప్రక్రియ పూర్తవుతుంద‌ని తెలిపారు. డిసెంబ‌రు 21న మంత్రి తెలియ‌జేసిన షెడ్యూలు ప్రకారం… నోటిఫికేష‌న్ విడుద‌ల చేశాక జ‌న‌వ‌రి 15 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు. జ‌న‌వ‌రి 19 నుంచి వెబ్ సైట్‌లో హాల్‌టికెట్లను ఉంచుతారు. ఫిబ్రవ‌రి 2న (ఆదివారం) ప‌రీక్ష నిర్వహించి, అదే నెల 20 న ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తారు. 100 మార్కుల ప్రశ్నప‌త్రంలో జ‌న‌ర‌ల్ స్టడీస్‌ 60, అర్థమెటిక్ ఎబిలిటీ 30, లాజిక‌ల్ స్కిల్స్ 10 మార్కుల‌కు ఉంటాయి. జ‌న‌ర‌ల్ స్టడీస్‌లో భాగంగా క‌రెంట్ అఫైర్స్‌, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకాన‌మీ, జ‌న‌ర‌ల్ సైన్స్‌, గ్రామీణాభివృద్ధి అంశాల‌పై ప్రశ్నలు ఇస్తారు.

 
Comments Off on వీఆర్‌వో, వీఆర్ఏ రాత‌ప‌రీక్ష ఫిబ్రవ‌రి 2న‌

Posted by on December 21, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: