RSS

ప్రాంగణ నియామకాల్లో 20 మంది విద్యార్థుల ఎంపిక

26 Dec

బాసర, న్యూస్‌టుడే: బాసర ట్రిపుల్‌ ఐటీలో రెండు రోజులుగా ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 20 మంది విద్యార్థులు ఉద్యోగానికి ఎంపికయ్యారు. ట్రిపుల్‌ ఐటీలోని ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లోని 600 మంది విద్యార్థులకు డిసెంబరు 23, 24 తేదీల్లో రాతపరీక్ష, బృందచర్చ, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో మెరుగైన ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు ఇన్ఫోసిస్‌ సంస్థ తమ సంస్థలో కొలువులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఎంపికైన విద్యార్థుల రెజ్యూమ్‌లను సంస్థ ఉన్నతాధికారులు ఆమోదం తెలిపిన అనంతరం విద్యార్థులను అధికారికంగా ప్రకటించనున్నట్లు బాసర ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ రాజేంద్రసాహు తెలిపారు.

 
Comments Off on ప్రాంగణ నియామకాల్లో 20 మంది విద్యార్థుల ఎంపిక

Posted by on December 26, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: