న్యూఢిల్లీ: దేశంలోని యువతకు స్ఫూర్తి కలిగించేలా అన్ని విశ్వవిద్యాలయాల్లో నోబెల్ విజేతల పేరిట పీఠాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 28న ప్రకటించింది. నోబెల్ బహుమతులు గెలుచుకున్న భారతీయులు రవీంద్రనాథ్ ఠాగూర్, సి.వి.రామన్, హరగోవింద్ ఖొరానా, మదర్ థెరిసా, సి.చంద్రశేర్, అమర్త్యసేన్, వి.రామకృష్ణన్ పేరిట వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. ‘ఈ పీఠాల ఏర్పాటు ద్వారా విశ్వవిద్యాలయాల్లోని ప్రతిభావంతులైన యువతను గుర్తించి స్ఫూర్తినివ్వాలన్నదే లక్ష్యమని’ కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు ప్రకటించారు. దేశ రాజధానిలో జరిగిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వజ్రోత్సవ సంబరాల్లో ఆయన మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజికశాస్త్రం తదితర అంశాల్లో మెరుగైన ప్రతిభ చూపిన వ్యక్తులకు జవహర్లాల్ నెహ్రూ పేరిట పురస్కారాలు ఇవ్వాలన్న యూజీసీ ప్రతిపాదనను ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్సింగ్ స్వాగతించారు. అత్యంత నాణ్యమైన పరిశోధనలు చేసేలా యువతను ప్రేరేపించేందుకు ఈ పురస్కారాలు ఉపకరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
నోబెల్ విజేతల పేరిట విశ్వవిద్యాలయాల్లో పీఠాలు
28
Dec
Advertisements