RSS

విద్యార్థుల పరిశోధనలకు ఇన్నోవేషన్ పార్క్

30 Dec

కోల్‌కతా: విద్యార్థులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ ముందుకు వచ్చింది. రాజర్హట్‌లో రూ.350 కోట్లతో పరిశోధన భవనం, ఇన్నోవేషన్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు డిసెంబరు 30న శ్రీకారం చుట్టింది. పరిశ్రమలపై పరిశోధన, అభివృద్ధి తదితర అంశాలన్నింటిపై దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులు, విదేశీయులు అందరూ ఒక్కచోట పనిచేసే విధంగా పది ఎకరాల్లో ఇన్నోవేషన్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర మానవ వనరుల మంతిత్వ శాఖ నుంచి అనుమతులు లభించినట్లు ఐఐటీ ఉన్నతాధికారులు తెలిపారు.

 
Comments Off on విద్యార్థుల పరిశోధనలకు ఇన్నోవేషన్ పార్క్

Posted by on December 30, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: