RSS

సాంకేతిక విద్యలో నాణ్యతను పెంచాలి

30 Dec

తిరువనంతపురం: దేశంలో సాంకేతిక విద్యలో నాణ్యతను పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్ఆర్‌డీ) మంత్రి పల్లంరాజు అన్నారు. పరిశ్రమ అవసరాలు తీర్చేలా పట్టభద్రులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఏటా ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుంటున్న విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నా.. అత్యధికుల్లో పరిశ్రమ ఆశిస్తున్న నైపుణ్యాలు కొరవడుతున్నాయన్నారు. దీంతో పరిశ్రమలే వాటి అవసరాల మేర ఇంజినీరింగ్ పట్టభద్రులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి వస్తోందన్నారు. ఇది మన సాంకేతిక విద్యా వ్యవస్థ లోపమన్నారు. డిసెంబరు 30న ఆయన తిరువనంతపురంలో అఖిలభారత సాంకేతిక విద్య కౌన్సిల్ (ఏఐసీటీఈ) నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోని పెద్ద సాంకేతిక విద్యావ్యవస్థల్లో మనది ఒకటైనా నాణ్యత లోపిస్తోందన్నారు. విద్యార్థుల్లో, బోధకుల్లో (ఫ్యాకల్టీ) నాణ్యత పెంచడానికి ప్రమాణాలు ఏర్పాటు చేయాలన్నారు.

 
Comments Off on సాంకేతిక విద్యలో నాణ్యతను పెంచాలి

Posted by on December 30, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: