RSS

2677 పంచాయతీ కార్యదర్శుల భర్తీ ప్రకటన జారీ

30 Dec

2677 పంచాయతీ కార్యదర్శుల భర్తీ ప్రకటన జారీ

* 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ
* ఫిబ్రవరి 23న రాత పరీక్ష
ఈనాడు-హైదరాబాద్: ఎట్టకేలకు పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-4) ఉద్యోగాల భర్తీ ప్రకటనను ఏపీపీఎస్సీ డిసెంబరు 30న జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2677 కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి అవసరమైన రాత పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీన ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. దరఖాస్తుల స్వీకరణ జనవరి 4న ప్రారంభమై అదే నెల 22వ తేదీ వరకు కొనసాగుతుంది. రాత పరీక్షలో సాధించిన మార్కుల్ని అనుసరించి నియామకాల ప్రక్రియను జిల్లా కలెక్టర్లు చేపడతారని, ధ్రువపత్రాల పరిశీలన తదుపరి చర్యలు జిల్లా స్థాయిలోనే జరుగుతాయని ఏపీపీఎస్సీ వెల్లడించింది.
* 1992లో ఇంటర్ అర్హతతో వీడీఓ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ రాత పరీక్ష నిర్వహించింది. వాటి హోదా మార్చి పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలుగా డిగ్రీ అర్హతతో భర్తీ చేయబోతుండడం ఇదే ప్రథమం.
* వయోపరిమితి 36 సంవత్సరాలుగా నిర్దేశించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు 34 సంవత్సరాలలోపు వయసుండాలి. అయితే.. 2013 జూన్ 29న ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల్ని అనుసరించి మరో రెండేళ్లకు అంటే 36 సంవత్సరాలకు వయోపరిమితిని పెంచారు.
* అర్హత: ఏదేని డిగ్రీ
* రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే ఈ నియామకాలు జరుగుతాయి.
* ఫిబ్రవరి 23న రాతపరీక్ష అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది.
* రెండు విభాగాలుగా రాతపరీక్షను నిర్వహించనున్నారు. పేపరు-1 జనరల్ స్టడీస్-150 మార్కులు, పేపరు-2 గ్రామీణాభివృద్ధి ఆధారంగా 150 మార్కులకు ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఒక్కో పేపరును గంటన్నర వ్యవధిలో(అబ్జెక్టివ్ పద్ధతిలో) నిర్వహించనున్నారు.
* జిల్లాలు- పోస్టుల వివరాలు:
శ్రీకాకుళం జిల్లా- 209, విజయనగరం- 201, వైజాగ్- 155, తూర్పుగోదావరి- 70, పశ్చిమ గోదావరి- 25, కృష్ణా- 08, గుంటూరు- 26, ఒంగోలు- 95, నెల్లూరు- 86, చిత్తూరు- 104, కడప- 26, అనంతపురం- 202, కర్నూలు- 164, కడప- 26, మహబూబ్‌నగర్- 350, రంగారెడ్డి- 57, మెదక్- 182, నిజమాబాద్- 66, ఆదిలాబాద్- 241, కరీంనగర్- 88, వరంగల్- 106, ఖమ్మం- 83, నల్గొండ- 133.
Notification

 
Comments Off on 2677 పంచాయతీ కార్యదర్శుల భర్తీ ప్రకటన జారీ

Posted by on December 30, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: