RSS

3 నుంచి ట్రిపుల్ఐటీలో ప్రాంగణ ఎంపికలు

30 Dec

వేంపల్లె, న్యూస్‌టుడే : ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో జనవరి 3, 4 తేదీల్లో అమర్‌రాజా బ్యాటరీస్ నేతృత్వంలో ప్రాంగణ ఎంపికలు జరగనున్నట్లు డైరెక్టర్ కృష్ణారెడ్డి డిసెంబర్ 30న తెలిపారు. ఈ కంపెనీకి కెమికల్, మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన అభ్యర్థులు అవసరం అన్నారు. ఇక్కడ ట్రిపుల్ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన 360 మంది, కెమికల్ ఇంజినీరింగ్ చేసిన 134 మంది ప్రాంగణ ఎంపికలకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. జనవరి నెలలో మరిన్ని కంపెనీలు ప్రాంగణ ఎంపికలకు వస్తాయని ఆయన తెలియజేశారు.

 
Comments Off on 3 నుంచి ట్రిపుల్ఐటీలో ప్రాంగణ ఎంపికలు

Posted by on December 30, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: