RSS

Daily Archives: January 1, 2014

36 ఏళ్ల వయో పరిమితిని కొనసాగించాలి


36 ఏళ్ల వయో పరిమితిని కొనసాగించాలి

* ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ లేఖ
* గుర్తించిన పోస్టుల భర్తీపై దృష్టి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో తాము భర్తీచేసే పోస్టులకు 36 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితిని కొనసాగించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రభుత్వానికి డిసెంబరు 31న లేఖ రాసింది. గరిష్ఠ వయోపరిమితిపై గతంలో ఇచ్చిన జీవో గడువు మంగళవారంతో ముగియడంతో… కొత్త నియామకాలకు ఆటంకాలు ఏర్పడకుండా అవే ఉత్తర్వులను కొనసాగించాలని అభ్యర్థించింది. వయోపరిమితి కొనసాగింపు ఉత్తర్వులు వచ్చిన వెంటనే, పెండింగ్‌లో ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టాలని ఏపీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి 34 సంవత్సరాలు ఉండగా, నిరుద్యోగుల వినతి మేరకు ప్రభుత్వం దాన్ని గతంలో 36 ఏళ్లకు పెంచింది. ఇది డిసెంబరు 31 వరకు వర్తించేలా గడువు విధించింది. అయితే ప్రస్తుతం వీఆర్‌వోలు, వీఆర్ఏలతో పాటు పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. మరో 16వేల పోస్టులు శాఖల ఆమోదం పొంది భర్తీ కోసం ఏపీపీఎస్సీకి వచ్చాయి. వీటన్నింటికీ వయోపరిమితే ప్రధానాంశం. ఈ నేపథ్యంలో 36 సంవత్సరాల వయోపరిమితిని కొనసాగించాలని ఏపీపీఎస్సీ ప్రభుత్వాన్ని కోరుతోంది. వివిధ శాఖల ఖాళీ పోస్టుల విషయంలో రోస్టర్ తదితర అంశాలపై చర్చించేందుకు జనవరి 6 నుంచి ఏపీపీఎస్సీ సమావేశాలు నిర్వహించనుంది. వాటి ఆధారంగా నోటిఫికేషన్లను జారీ చేస్తుంది.

Advertisements
 
Comments Off on 36 ఏళ్ల వయో పరిమితిని కొనసాగించాలి

Posted by on January 1, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: