RSS

టెట్ నిర్వహణ ఖాయం

02 Jan

టెట్ నిర్వహణ ఖాయం

ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను వీలైనంత త్వరగా నిర్వహించాలని విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. టెట్‌ను కచ్చితంగా నిర్వహిస్తామని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖమంత్రి కె.పార్థసారధి ఇటీవల ప్రకటించారు. జనవరి 1న సచివాలయంలో ఆయనతో విద్యాశాఖ అధికారులు సమావేశమైనప్పుడు టెట్ విషయం ప్రస్తావనకు వచ్చింది. జనవరి నెలాఖరులోగా పరీక్ష నిర్వహణ జరిగేలా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు మంత్రి సూచనతో పరీక్ష తేదీ నిర్ణయానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నెల చివరి ఆదివారం టెట్ పెట్టాలనుకొంటున్నారు. ఆ రోజున గణతంత్ర దినోత్సవం కావడం వల్ల పరీక్ష నిర్వహణ కుదురుతుందా లేదా అన్న విషయం మీద సందిగ్ధం నెలకొంది. ఈ నెల 26న కుదరని పక్షంలో ఫిబ్రవరి 2న పరీక్షపెట్టే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో నాలుగో దఫా జారీచేసిన ప్రకటన అనుసరించి టెట్ రాసేందుకు సుమారు 4.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తుచేశారు. సెప్టెంబరులో ఈ పరీక్ష రాసేందుకు తేదీ ఖరారు చేయగా సీమాంధ్ర ఉద్యమం కారణంగా జరపలేని పరిస్థితులు తలెత్తడంతో వాయిదా అనివార్యమైంది. ఈ పరీక్ష నిర్వహణ కోసం అభ్యర్థుల నుంచి పది కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఇందులో మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రశ్నపత్రాల ముద్రణ, పరీక్ష నిర్వహణ కోసం అవసరమైన ఇతర చర్యలను విద్యాశాఖనే తీసుకుంది. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే ఉద్యోగార్థులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో బోధకులుగా చేరడంలో ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది.

Advertisements
 
Comments Off on టెట్ నిర్వహణ ఖాయం

Posted by on January 2, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: