RSS

Daily Archives: January 3, 2014

కార్మిక సంక్షేమ శాఖ మెరిట్ స్కాలర్‌షిప్‌లు


హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ షాపులు, కో-ఆపరేటివ్ సొసైటీలు తదితర సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కార్మిక సంక్షేమ శాఖ అధికారులు జనవరి 3న ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ విద్యార్థులకు, ఐటీఐ వారికి రూ.1000, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, ఎంబీఏ తదితర కోర్సులు చదువుతున్న వారికి రూ.2000 చొప్పున మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు స్థానిక లేబర్ కార్యాలయాల్లో సంప్రదించి దరఖాస్తులు స్వీకరించి పూర్తి వివరాలతో ఫిబ్రవరి 15లోగా అందజేయాల్సి ఉంటుంది.

Advertisements
 
Comments Off on కార్మిక సంక్షేమ శాఖ మెరిట్ స్కాలర్‌షిప్‌లు

Posted by on January 3, 2014 in Uncategorized

 

వీఆర్వో, వీఆర్ఏలకు అర్హత ఉంటేనే దరఖాస్తు చేయండి


వీఆర్వో, వీఆర్ఏలకు అర్హత ఉంటేనే దరఖాస్తు చేయండి * సీసీఎల్ఏ కార్యదర్శి సూర్యకుమారి సూచన
ఈనాడు, హైదరాబాద్: రెవెన్యూ శాఖ భర్తీ చేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు గ్రామాల వారీగా ఉన్న ఖాళీలు, రిజర్వేషన్ల వారీగా వివరాలను పరిశీలించుకుని ఆ మేరకు అర్హత ఉన్నవారే దరఖాస్తు చేయాలని సీసీఎల్ఏ కార్యదర్శి ఎ.సూర్యకుమారి జనవరి 2న తెలిపారు. పలువురు అభ్యర్థులు ముందుగా ఫీజు చెల్లించి తర్వాత వివరాలను తెలుసుకుని అర్హతలేని వారు ఇబ్బందిపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్రామాల వారీగా ఉన్న ఖాళీల వివరాలు, రిజర్వేషన్‌ల వివరాలను పరిశీలించుకున్న తర్వాతే ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రిజర్వేషన్లు, గ్రామాల వారీగా ఖాళీల వివరాలు భూపరిపాలనశాఖ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించారు.
రాష్ట్రంలో ఖాళీగాఉన్న 1657 గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో ), 4305 గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు జిల్లాల వారీగా డిసెంబ‌ర్ 28న కలెక్టర్లు విడుద‌ల చేశారు. మొత్తం 5,962 పోస్టుల నియామకానికి గాను ప్రకటనలు వెలువడ్డాయి. సెంటర్ ఫర్ గుడ్ గవర్ననెన్స్ (సీజీజీ) ఈ ఉద్యోగాల నియామకానికి అవసరమైన సాంకేతిక పరమైన అంశాల తోడ్పాటును అందిస్తుంది.

 
Comments Off on వీఆర్వో, వీఆర్ఏలకు అర్హత ఉంటేనే దరఖాస్తు చేయండి

Posted by on January 3, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: