RSS

Daily Archives: January 7, 2014

‘ఉపకారం’లో అవినీతికి చెక్


ఈ ఏడాది నుంచే బయోమెట్రిక్ విధానం
* తీరనున్న కళాశాల విద్యార్థుల వేతనాల వెతలు
కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందచేస్తున్న ఉపకారవేతనల్లో అవినీతి చాలా సర్వసాధారణమైంది. దీనికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా పూర్తి ఆన్‌లైన్ విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. దీనిని బయోమెట్రిక్ విధానంగా పేర్కొంటున్నారు. ఇది 2013-2014 సంవత్సరంలోనే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాదికి సంబంధించి కొత్తగా ఉపకారవేతనాలు పొందే వారు, పాతవాటి పునరుద్ధరణకు ఈ కొత్తవిధానాన్నే అనుసరించాల్సి ఉంది. దీనికి సంబంధించి పాడేరు, నర్సీపట్నం డివిజన్లోని కళాశాలల ప్రిన్సిపాళ్లు అందరికి అవగాహన కల్పించేందుకు నర్సీపట్నంలో సదస్సు నిర్వహించారు. వీరికి రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ ప్రధాక కార్యదర్శి రేమండ్ పీటర్ కూడా వీడియోకాన్ఫెరెన్స్ ద్వారా దీని గురించి అన్నింటిని వివరించారు. నర్సీపట్నం ప్రాంతంలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాల బయోమెట్రిక్ యంత్రాన్ని తమ కళాశాల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
అన్ని కళాశాలలకు తప్పనిసరి
ఉపకారవేతనాల దరఖాస్తులను ఇన్నాళ్లూ అధికారులు పరిశీలించేవారు. కొత్త విధానంతో ఇక వీరితో పని లేకుండా పరిశీలన కార్యక్రమం అంతా కళాశాలల స్థాయిలోనే నిర్వహించనున్నారు. బయోమెట్రిక్ పాస్ (పాయింట్ ఆఫ్ సేల్స్)గా పేర్కొంటున్న యంత్రాలను అన్ని కళాశాలలు విధిగా సమకూర్చుకొని ఈ కొత్త విధానాన్ని అమలు చేయాల్సి ఉంది. వీటికి ఈ పాస్ సర్వర్, ఆధార్ సర్వర్ అనుసంధానమై ఉంటాయి. వీటిలో కళాశాల కోడ్, దరఖాస్తు కోడు నమోదు చేస్తే పూర్తి వివరాలు వస్తాయి. కళాశాలల ప్రిన్సిపాళ్లు ముందుగా వీటిలో రిజిష్టరు చేసుకోవాలి. విద్యార్థి తన చేతి వేళ్లలో ఏదో ఒకదానిని ఈ యంత్రంపై ఉంచితే అన్ని వివరాలు వస్తాయి.
బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం
ఉపకరవేతనాలకు అర్హులైన విద్యార్థులంతా కొత్త విధానం ప్రకారం బ్యాంకులకు వెళ్లి అక్కడి అధికారులతో సంప్రదించి తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబరు అనుసంధానమయ్యేలా చూసుకోవాలి. విద్యార్థుల తమ వివరాలను ఆన్‌లైన్లో రిజిస్టరు చేసుకోగానే అవి జిల్లా అధికారులకు చేరుతాయి. సక్రమంగా ఉన్న వీటిని కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపుతారు. ఆధార్, బ్యాంకు ఖాతాల నకళ్లలో వివరాలు స్పష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా సంక్షేమాధికారులు బార్‌కోడ్ రీడర్ సదుపాయం సమకూర్చుకొని వాటి ద్వారా వివరాలను పరిశీలించి అనుమతిస్తారు.
ఉపకారం మంజూరైతేనే ఫీజు రీయంబర్స్‌మెంటు
కొత్త విధానంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు వేగంగా మంజూరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. వీటిని మంజూరు చేసిన ఆనంతరమే సంబంధిత విద్యార్థి ఫీజు రీఎంబర్స్‌మెంటును కళాశాలలకు చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీంతో త్వరితగతిన వీటిని మంజూరు చేసేందుకు కళాశాలల యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి. కొత్త పద్ధతిలో విద్యార్థి విధిగా ఉండి బయోమెట్రిక్ యంత్రాన్ని వినియోగించాల్సి ఉంది. ఉపకారవేతనం మంజూరైతే ఆన్‌లైన్ ద్వారానే ఆ సొమ్ము బ్యాంకుకు జమ అవుతుంది. దీంతో వీటిని బోగస్ వ్యక్తులు పొందే అవకాశం లేదు. విద్యార్థులు కూడా అన్ని కార్యాలయాలు తిరగడం తదితర బాధలు తగ్గుతా

Advertisements
 
Comments Off on ‘ఉపకారం’లో అవినీతికి చెక్

Posted by on January 7, 2014 in Uncategorized

 

పెరిగిన ముస్లిం బాలల బడిబాట నమోదు


* కేంద్ర మంత్రి పల్లంరాజు
న్యూఢిల్లీ: దేశంలో ముస్లింల జనాభాతో పోలిస్తే..పాఠశాలల్లో ఆ వర్గం బాలల నమోదు పెరిగిందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎం.ఎం.పల్లంరాజు తెలిపారు. 2006-07లో ప్రాథమిక పాఠశాలల్లో 9.4 శాతం ఉన్న ముస్లిం బాలల నమోదు 2012-13లో 14.2 శాతానికి, ప్రాథమికోన్నత స్థాయిలో 7.2 శాతం నుంచి 12.1 శాతానికి పెరిగిందని మంత్రి చెప్పారు. మైనారిటీల విద్యకు సంబంధించి జాతీయ పర్యవేక్షణ కమిటీ (ఎన్‌ఎంసీఎంఈ) వార్షిక సమావేశంలో జనవరి 6న ఆయన మాట్లాడారు. 20 శాతం అంతకన్నా ఎక్కువ ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో 270 ఆదర్శ (మోడల్‌) పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. 12వ పంచవర్ష ప్రణాళిక కాలం (2012-17)లో ఏర్పాటుకు ప్రతిపాదించిన 378 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో.. 196 విద్యాలయాలను ముస్లింలు ఎక్కువగా ఉన్న, ప్రత్యేక హోదా జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు రాజు వెల్లడించారు. బడి బయట ఉన్న ముస్లిం బాలలకు విద్య కల్పించేందుకు సర్వశిక్షాఅభియాన్‌లో మదర్సాలకు నిధులు కేటాయిస్తున్నామన్నారు.
”ఈ విద్యా సంవత్సరంలో మదర్సాల్లోని 17.3 లక్షల మంది విద్యార్థులకు అభియాన్‌లో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, 40 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ, 8,325 మదర్సాలకు పాఠశాల నిధులు” కేటాయించినట్లు పల్లంరాజు తెలిపారు. నాణ్యమైన విద్య అందించేందుకు 2012-13లో 9,905 మదర్సాల్లో 23,146 మంది ఉపాధ్యాయులను నియమించామన్నారు.

 
Comments Off on పెరిగిన ముస్లిం బాలల బడిబాట నమోదు

Posted by on January 7, 2014 in Uncategorized

 

ఉద్యోగ భర్తీ ప్రకటనల జారీపై ఏపీపీఎస్సీ దృష్టి!


ఉద్యోగ భర్తీ ప్రకటనల జారీపై ఏపీపీఎస్సీ దృష్టి!

ఈనాడు-హైదరాబాద్: ఉద్యోగ నియామకాల ప్రకటనల జారీపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో కాస్త కదలిక మొదలైంది. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారాన్ని అనుసరించి రోస్టర్ పాయింట్స్, ఇతర సమాచారం కోసం జనవరి 6న ఆయా శాఖల ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేపట్టింది. ఒకవైపు అభ్యర్థుల ఎదురుచూపులు, మరోవైపు ఎన్నికల సమయం కావడంతో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి సైతం ఒత్తిళ్లు రావచ్చునన్న ఉద్దేశంతో తీసుకోవాల్సిన చర్యలపై ఆలస్యంగానైనా దృష్టి సారించింది. ఏపీపీఎస్సీ ద్వారా సుమారు 20 వేల పోస్టుల భర్తీ జరగాల్సి ఉంది. గ్రూపు-1, గ్రూపు-2, ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు, ఇతర ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినా..రోస్టర్ పాయింట్స్ (సామాజికవర్గాల వివరాలు) వంటి సమాచారంపై ఆయా శాఖల అధికారులతో ఏపీపీఎస్సీ జనవరి 6న నిర్వహించిన సమావేశానికి ప్రాధాన్యం చేకూరింది. ఈ నెల 18వ తేదీలోగా అన్ని శాఖల నుంచి పూర్తి సమాచారం అందేలా ఏపీపీఎస్సీ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

 
Comments Off on ఉద్యోగ భర్తీ ప్రకటనల జారీపై ఏపీపీఎస్సీ దృష్టి!

Posted by on January 7, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: