RSS

నైతిక విద్య తప్పనిసరి

08 Jan

న్యూఢిల్లీ: నర్సరీ నుంచీ విశ్వవిద్యాలయ స్థాయి దాకా విద్యార్థుల పాఠ్యప్రణాళికలో నైతిక విలువలను ప్రబోధించే విద్యను తప్పనిసరి చేయాలన్న అభ్యర్థనను కేంద్రప్రభుత్వం పరిశీలించి… పరిగణనలోకి తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు జనవరి 8న పేర్కొంది. ఈ విషయాన్ని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ)కి కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలించాల్సిందిగా మానవవనరుల అభివృద్ధిశాఖను ఆదేశించినట్లు చీఫ్ జస్టిస్.ఎన్వీ.రమణ, జస్టిస్.రాజీవ్ సహాయ్ ఎండ్లాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మధుముకుల్ త్రిపాఠి, ఆర్పీ.అరోరా అనే న్యాయవాదులు ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు.

 
Comments Off on నైతిక విద్య తప్పనిసరి

Posted by on January 8, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: