RSS

Daily Archives: January 12, 2014

చిన్నారులకు చదువే కాదు.. బాధ్యతలూ నేర్పాలి


 

* జస్టిస్చలమేశ్వర్వెల్లడి

 

ఈనాడు, న్యూఢిల్లీ: విద్యార్థులకు కేవలం చదువే కాకుండా, సమాజంలో వారి బాధ్యతలను కూడా తెలియజెప్పాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ(ఏఈఎస్) ఆధ్వర్యంలో జనవరి 12న జరిగిన సంక్రాంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలకు చదువు చెప్పడమంటే నాలుగు తెలుగు ముక్కలు, ఇంగ్లీషు, సైన్సు పాఠాలు చెప్పడం కాదు.. సమాజ స్వరూపం, మనుషుల కర్తవ్యం, సమాజంలో వారి బాధ్యతలు తెలియజెప్పాలి. ఈ విషయాన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు.

Advertisements
 
Comments Off on చిన్నారులకు చదువే కాదు.. బాధ్యతలూ నేర్పాలి

Posted by on January 12, 2014 in Uncategorized

 

నాణ్యమైన ఉన్నతవిద్యకు ప్రాధన్యత


 

* కేంద్రమానవవనరులఅభివృద్ధిశాఖమంతిపళ్లంరాజు
* జేఎన్‌టీయూకేలోఇంటర్యూనివర్శిటీకార్యాలయంప్రారంభం

 

కాకినాడ (బాలాజీచెరువు), న్యూస్‌టుడే: దేశంలో నాణ్యమైన ఉన్నతవిద్యను అందించేవిధంగా 12వ పంచవర్ష ప్రణాళికలో తగిన కార్యక్రమాలు రూపొందిస్తున్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు పేర్కొన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ ప్రాంగణంలో ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ తాత్కాలిక (ఐయూసీటీఈ సెంటర్) కార్యాలయాన్ని జనవరి 12న ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జేెఎన్‌టీయూకేలో రూ.300 కోట్లుతో ఏర్పాటు చేస్తున్న ఇంటర్‌యూనివర్శిటీ సెంటర్‌తో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. దేశంలో ఉన్న ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక అధ్యాపకులకు ఇక్కడ బోధనాంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారన్నారు. భారతదేశంలో ఎక్కువశాతం యువతేనని వారికి విలువలతోకూడిన బోధన చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం సంఘంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు రుణాలు తీసుకుని చదివిస్తున్నారన్నారు. విద్యావ్యవస్థలో పెనుమార్పులు రావాలని, దూరవిద్య, ఓపెన్‌యూనివర్శిటీల ద్వారా కూడా విద్యాప్రమాణాలు పెంచాలన్నారు. కార్యక్రమంలో ప్రత్యేకఅతిధిగా పాల్గొన్న యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వేదప్రకాష్ మాట్లాడుతూ గ్రామీణ బడుగువర్గాల పిల్లల విద్యకు రూ.45వేల కోట్లు కేంద్రప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో నేషనల్ కౌన్సెల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ సంతోష్‌పాండా మాట్లాడుతూ ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వడం ద్వారా చారిత్రాత్మమకమైన మార్పులు వస్తాయన్నారు. ప్లస్‌టూ విద్య తర్వాత నాలుగేళ్లు ఉపాధ్యాయ శిక్షణ ప్రవేశపెట్టే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఐయూసీ హయ్యర్ ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రటరీ ఆర్‌పీ శిసోడియా మాట్లాడుతూ మంచి ఉపాధ్యాయుల వలన దేశం ప్రగతిపధంలో నడుస్తుందన్నారు. రాష్ట్ర ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ డాక్టర్ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ కాకినాడకు ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ మంజూరు కావడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు మంచి గుర్తింపు వచ్చిందన్నారు.

 
Comments Off on నాణ్యమైన ఉన్నతవిద్యకు ప్రాధన్యత

Posted by on January 12, 2014 in Uncategorized

 

సీమాంధ్రలో కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రతిపాదనలు


 

* రాష్ట్రఉన్నతవిద్యామండలిఛైర్మన్‌ఎల్‌వేణుగోపాల్‌రెడ్డి

 

గజపతినగరం గ్రామీణం: సీమాంధ్రలో మూడు చోట్ల కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఎల్‌ వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. జనవరి 11న (శనివారం సాయంత్రం) మరుపల్లిలోని బాలాజీ పాలిటెక్నిక్‌ కళాశాలలో రెండో భవనం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. విజయనగరం, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటిని క్రమంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలుగా మార్చే ఆలోచనను ప్రభుత్వం చేస్తోందని చెప్పారు. దీనికోసం రూ. 25వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఏర్పడిన ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు.

 
Comments Off on సీమాంధ్రలో కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రతిపాదనలు

Posted by on January 12, 2014 in Uncategorized

 

అకుంఠిత దీక్షతో ఉన్నతస్థానం ఖాయం


మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌
* వేడుకగా విజ్ఞాన్‌ మహోత్సవ్‌ ప్రారంభం

ఈనాడు – గుంటూరు: యువత కొత్త రంగాలను ఎంచుకుని, వినూత్న ఆలోచనలతో, అకుంఠిత దీక్షతో శ్రమిస్తే ఉన్నత శిఖరాలకు ఎదగడం ఖాయమని మార్గదర్శి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.హెచ్‌. శైలజాకిరణ్‌ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో జనవరి 10న జరిగిన విజ్ఞాన్‌ మహోత్సవాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి ఉత్తేజభరితంగా ప్రసంగించారు. వినూత్న రంగాలను ఎంచుకుని విజయం సాధించిన యువత విజయగాథలను ఆమె వివరించారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) రంగంలో భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు.

కార్పొరేట్‌ సంస్థలు తమ లాభాలలో రెండు శాతం సీఎస్‌ఆర్‌ కింద ఖర్చు చేయాలన్న నిబంధన ఉంది. మన దేశంలో ప్రస్తుతం సీఎస్‌ఆర్‌ కింద రూ. 5 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ మొత్తం త్వరలోనే రూ. 10 వేల కోట్లకు చేరనుంది. ఆయా సంస్థలు సీఎస్‌ఆర్‌ కింద డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నా, ఆ పనులు చేపట్టే తీరిక వాటికి ఉండటం లేదు. తమ తరఫున సీఎస్‌ఆర్‌ నిర్వహించే వారి కోసం అవి అన్వేషిస్తున్నాయి. అందుకే భవిష్యత్తులో ఇది మంచి ఉపాధి అవకాశాలు ఉన్న రంగంగా ఎదుగుతుంది. విద్యా సంస్థలు కూడా ఈ అంశాన్ని బోధనాంశాల్లో చేర్చాలి” అని పేర్కొన్నారు. ఉన్నతస్థాయికి ఎదగాలంటే డబ్బు కంటే విషయజ్ఞానం, ఏదైనా సాధించాలన్న తపన ప్రధానమైనవని విద్యార్థులకు సూచించారు. స్వల్పకాలిక, ధీర్ఘకాలిక లక్ష్యాలపై సమతుల్యత పాటిస్తూ సమయానుసారంగా నిర్ణయాలు మార్చుకుంటూ ముందుకెళ్లడమే నాయకత్వ లక్షణమన్నారు. ఆరంభంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా వాటికి తలొగ్గితే ముందుకెళ్లలేమని, ధైర్యంగా నిలిస్తే లక్ష్యాలు చేరుకుని విజయం దిశగా అడుగులేస్తామన్నారు. తెలివైనవారు మార్పును ఆహ్వానిస్తూ, రాబోయే ఇబ్బందులను ముందుగానే గ్రహించి ముందుకు సాగిపోతుంటారని పేర్కొన్నారు. ప్రతి పరాజయం అభివృద్ధికి సోపానమని, గొప్పవారంతా పరాజయాలను అనుభవాలుగా తీసుకుని వాటిని సరిచేసుకుంటూ గమ్యాన్ని చేరుకున్నారని విద్యార్థులకు వివరించారు.

 
Comments Off on అకుంఠిత దీక్షతో ఉన్నతస్థానం ఖాయం

Posted by on January 12, 2014 in Uncategorized

 

దేశ పునర్‌నిర్మాణానికి పునాదులుకండి


* రామకృష్ణ మఠంలో ఘనంగా యువజనోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్, న్యూస్‌టుడే: దేశాన్ని ప్రేమించండి, దేశ పునర్ నిర్మాణానికి పునాదులుగా నిలవండని సీబీఐ మాజీ జేడీ, ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ యువతకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని రామకృష్ణమఠంలో మూడు రోజులపాటు జరిగే జాతీయ యువజనోత్సవాలు జనవరి 10న ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ… జపనీయుల వంటి దేశభక్తిని, జాతి ప్రగతి కోసం వారు కష్టపడే తీరును అలవర్చుకోవాలని కోరారు. వేల ఏళ్ల క్రితమే ఘనమైన శాస్త్ర, సాంకేతిక విజ్ఞానంతో భారత్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిందనీ, ఆర్యభట్ట, భాస్కరాచార్య, చరకుడు, శుశ్రుతుడు వంటి మేధావులుండేవారనీ, తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాయని గుర్తుచేశారు. ప్రపంచ దేశాలు పౌరులను ఆడ, మగలుగా పరిగణిస్తే, భారత్ మాత్రం సోదరి, సోదరులుగా గౌరవిస్తోందన్నారు. చదువు, ఉద్యోగం, డబ్బు సంపాదించడం… ఇదే జీవితం కాదన్నారు. దేశ సేవలోనే నిజమైన సంతృప్తి కలుగుతుందన్నారు. నిస్సహాయులకు చేయూతనిచ్చేందుకు శ్రద్ధ చూపాలన్నారు.

 
Comments Off on దేశ పునర్‌నిర్మాణానికి పునాదులుకండి

Posted by on January 12, 2014 in Uncategorized

 

ప్రతి విద్యార్థినీ ప్రముఖుడిగానే భావించాలి


గాంధీనగర్: నిర్మాణాత్మక మార్పు కోసం దేశం ఎదురుచూస్తోందని గుజరాత్ ముఖ్యమంత్రి, భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ విద్యాశాఖ, భారత పరిశ్రమ సమాఖ్య (సీఐఐ) నిర్వహిస్తున్న జాతీయ విద్యా సదస్సును మహాత్మా మందిర్‌లో ప్రారంభించిన సందర్భంగా మోడీ జనవరి 10న మాట్లాడుతూ ఓ వ్యక్తి సమగ్ర అభివృద్ధికి సానుకూల వాతావరణం ఉండాలని సూచిస్తూ ”కేవలం పుస్తకాలతోనే మనస్సు వికసించదు. అందుకు తగిన వాతావరణం కల్పించాలి”. అని చెప్పారు. అన్ని రకాల ఉద్యోగాలూ ముఖ్యమేనని, అన్నింటినీ గౌరవించాల్సిందేనని మోడీ స్పష్టం చేశారు. ”వైట్ కాలర్ ఉద్యోగాలంటే ఇంత పిచ్చి ఎందుకో? చిన్న ఉద్యోగాలు చేస్తే తప్పేమిటి? ఈ ఆలోచన మారాలి”. అన్నారు. ప్రతి విద్యార్థినీ ప్రసిద్ధ వ్యక్తి (సెలెబ్రటీ)లాగానే చూడాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవర్తన ధ్రువీకరణ పత్రం (క్యారెక్టర్ సర్టిఫికెట్) బదులు సామర్థ్య ధ్రువీకరణ పత్రం (యాప్టిట్యూడ్ సర్టిఫికెట్) ఇవ్వాలని సూచించారు. ”ప్రవర్తన ధ్రువీకరణ పత్రం వల్ల ఉపయోగమేమిటి? గుజరాత్‌లో సామర్థ్య ధ్రువీకరణ పత్రాలే ఇస్తున్నాం”. అని చెప్పారు. ఐఐటీల కోర్సు తీరును మార్చామని, దీనివల్ల యువత చాలా మందికి ప్రయోజనం కలిగిందని మోడీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 100 మందికిపైగా ఉపకులపతులు, వివిధ విద్యాసంస్థల సంచాలకులు, వివిధ రంగాల నిపుణులు, మేధావులు, విదేశీ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు హాజరయ్యారు.

 
Comments Off on ప్రతి విద్యార్థినీ ప్రముఖుడిగానే భావించాలి

Posted by on January 12, 2014 in Uncategorized

 

వీఆర్‌వో, వీఆర్ఏ పోస్టులకు 14 లక్షల దరఖాస్తులు


వీఆర్‌వో, వీఆర్ఏ పోస్టులకు 14 లక్షల దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వీఆర్‌వో, వీఆర్ఏ పోస్టులకు అభ్యర్థులు అనూహ్య రీతిలో స్పందించారు. మొత్తం 1,657 గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌వో) పోస్టులకు, 4,305 గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ రెండు పోస్టులకు దరఖాస్తుల దాఖలుకు చివరిరోజైన జనవరి 12 నాటికి 14.33 లక్షల మంది ఫీజు చెల్లించారు. ఆదివారం సాయంత్రానికి 11.33 లక్షల మంది దరఖాస్తు దాఖలు ప్రక్రియ పూర్తిచేయగా, మిగతావారు రెండో దశ పూర్తిచేయడానికి రెండు రోజుల గడువు ఉంది. వీఆర్‌వో పోస్టులకు 11 లక్షల మందికి పైగా పోటీ పడుతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు, ఇంజినీరింగ్ పట్టభద్రులు, ఇతర ఉన్నత విద్యావంతులు, కోచింగ్‌లకు వేల రూపాయలు పోస్తూ గ్రూప్-1 లాంటి పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నవారూ వీఆర్‌వో ఉద్యోగాలకు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసి పరీక్షకు సిద్ధం అవుతున్నారు. ఇదే సమయంలో వారం క్రితం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన పంచాయతీ కార్యదర్శి పోస్టులకూ స్పందన బాగుంది. డిగ్రీ కనీస విద్యార్హతగాగల ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల దాఖలుకు గడువు ఈ నెల 22 వరకు ఉంది.

 
Comments Off on వీఆర్‌వో, వీఆర్ఏ పోస్టులకు 14 లక్షల దరఖాస్తులు

Posted by on January 12, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: