RSS

Daily Archives: January 13, 2014

happy pongal


Pongal-Wishes-Quotes-2013 sankranthi-2013-Greetings-Photos-In-Telugu

Advertisements
 
Comments Off on happy pongal

Posted by on January 13, 2014 in Uncategorized

 

మన గణిత గతం ఎంతో ఘనం


* డీఆర్‌డీవో అధిపతి అవినాశ్‌ చందర్‌
ఈనాడు, హైదరాబాద్‌: పూర్వం గణిత, ఖగోళ శాస్త్రాల్లో ప్రపంచానికి మన దేశం ఎన్నో ఆవిష్కరణలు అందించిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అధిపతి అవినాశ్‌ చందర్‌ పేర్కొన్నారు. డీఆర్‌డీవో ఏఎస్‌ఎల్‌లో ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వేద్‌వీర్‌ ఆర్య రచించిన ‘గణిత, ఖగోళ శాస్త్రాలు-భారత్‌ భాగస్వామ్యం’ పుస్తకాన్ని జనవరి 12న ఆయన హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాశ్‌ మాట్లాడుతూ.. ”పూర్వం మనదేశం గొప్పదని వేదాలు చెబుతున్నాయని అంటున్నాం. ఏం గొప్పదని అంటే.. చెప్పలేని స్థితిలో ఉన్నాం. గణిత, ఖగోళ శాస్త్రాల్లో ఎన్నో కొత్త ఆవిష్కరణలను భారత్‌ అందించిందనేందుకు ఈ పుస్తకమే ఆధారం. భవిష్యత్తులో దేశానికి ఇది గొప్ప సంపదవుతుంది” అని చెప్పారు. బిర్లా సైన్స్‌ కేంద్రం డైరెక్టర్‌ బి.జి.సిద్ధార్థ మాట్లాడుతూ.. భారత చరిత్రను విదేశీయులు రాయడం వల్ల చాలా విషయాలు తెలియకుండా పోయాయన్నారు. ఖగోళ, గణిత రంగాల్లోనే కాదు శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ విదేశాల కంటే మనదేశమే ముందుండేదని చెప్పారు. మన దేశ గొప్పదనం వేదాల్లో ఉన్నా అది అర్థం కాని కారణంగా అర్థమయ్యేరీతిలో శాస్త్రీయ పరిశోధన ఆధారంగా రాసిన ఈ పుస్తకం సమాజానికి గొప్ప బహుమతి అని చెప్పారు. కార్యక్రమంలో రచయిత వేద్‌వీర్‌ ఆర్య, డీఆర్‌డీవో చీఫ్‌ కంట్రోలర్‌(ఆర్‌ అండ్‌ డీ) వి.జి.శేఖరన్‌ తదితరులు పాల్గొన్నారు.

 
Comments Off on మన గణిత గతం ఎంతో ఘనం

Posted by on January 13, 2014 in Uncategorized

 

రెండు పరీక్షల ఉమ్మడి వ్యూహం!


రెండు పరీక్షల ఉమ్మడి వ్యూహం!

నిరుద్యోగుల పాలిట ఒయాసిస్‌లా వీఆర్‌వో, పంచాయితీ సెక్రటరీ (పీఎస్‌) పోస్టుల ప్రకటనలు రావడంతో నిరుద్యోగులు ఆనంద పడ్డారు. కానీ రెండు పరీక్షల మధ్యా 20 రోజులే వ్యవధి ఉండడంతో ఏదో ఒకటి రాయాలేమో అని చాలామంది భావిస్తున్నారు. ఇలా చేస్తే విలువైన అవకాశాల్ని కోల్పోయినట్టే! అలాంటి పరిస్థితి లేకుండా రెండు అవకాశాలూ పొందే వ్యూహం పరిశీలిద్దాం!
ఫిబ్రవరి 2న వీఆర్‌వో/ వీఆర్‌ఏ పరీక్ష; ఫిబ్రవరి 23న పంచాయతీ కార్యదర్శి పరీక్ష! రెండు ఉద్యోగాలూ పొందాలని ఉంది. కానీ వీఆర్‌వో రాతపరీక్ష ముగిసిన తరువాత కేవలం 20 రోజుల్లోనే రెండో పరీక్షకు సిద్ధపడాలి. ఎలా?
రెండు పరీక్షలూ రాస్తున్న అభ్యర్థులు ముందస్తుగా పట్టికలోని 1, 2 కాలమ్స్‌లోని పాఠ్యాంశాలపై దృష్టి నిలపాలి. ఈ ధోరణి వీఆర్‌వో సన్నద్ధతలో భాగంగా కొనసాగించాలి. ఈ సన్నద్ధతలో భాగంగానే అరిథ్‌మెటిక్‌, ఏపీ ఎకనమిక్‌ జాగ్రఫీ, పంచాయతీరాజ్‌, ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి పథకాలకు సమయం వెచ్చించాలి. జనరల్‌ సైన్స్‌ అనువర్తనాల్లో ముఖ్యంగా జీవశాస్త్ర సంబంధిత అంశాలపై ప్రశ్నలు అధికంగా ఉండే అవకాశముంది. అలాంటివాటిని ప్రజారోగ్యం కింద చదవడం రెండు పరీక్షలకూ ఉపయుక్తం.
చరిత్రపై సాధారణ పరిజ్ఞానం, అణగారిన వర్గాల సమాచారంపై వీఆర్‌వో పరీక్ష ముగిసేవరకు సాధారణ స్థాయిలో సిద్ధమైతే సరిపోతుంది. వీఆర్‌వో పరీక్ష అనంతరం ఈ రెండు అంశాల్నీ మరింత లోతుగా చదివితే మంచిది. ‘రీజనింగ్‌’కు వీఆర్‌వో పరీక్షలో కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అందువల్ల లోతైన అధ్యయనం ద్వారా రెండు పరీక్షల్లో కచ్చితమైన మార్కులు సాధించవచ్చు.


ఫిబ్రవరి 2న వీఆర్‌వో పరీక్ష ముగియగానే పట్టికలోని కాలమ్‌ (3) అంశాలపై దృష్టి నిలపాలి. అయితే కాలమ్‌ (3)లోని కింది అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ చదివితే 15 రోజుల సన్నద్ధతలో కూడా గరిష్ఠ మార్కులు సాధించవచ్చు.
కాలమ్‌ ‘3’లోని మిగతా అంశాలకు సమయాన్ని బట్టి ప్రాధాన్యమివ్వాలి. అయితే అనలిటికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ వంటివి తక్కువ సాధన సమయం కేటాయించి కూడా మార్కులు కచ్చితంగా స్కోర్‌ చేయవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మిగిలిన ఈ కాలంలో ప్రతిరోజూ అర్ధగంట సమయం కేటాయించడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చు.
రెండు నోటిఫికేషన్లు విడుదలైన తరువాత అభ్యర్థుల్లో మెజారిటీ శాతం వీఆర్‌వో/ వీఆర్‌ఏ వైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తం ఉద్యోగాలు ‘స్థానికా’నికే కేటాయించడం, సామాజికపరంగా వీఆర్‌వోలకు అధిక గుర్తింపు ఉండడం, పదోన్నతుల్లో జాప్యం జరిగినా మంచి ఉద్యోగాల్లో ప్రవేశించేందుకు అవకాశం ఉండడం- ఈ కారణాల వల్ల ‘పంచాయతీ కార్యదర్శి’ వైపు ఎక్కువమంది ఆసక్తి చూపడం లేదు. దీంతో వీఆర్‌వో పరీక్షలో భారీ పోటీ ఏర్పడనుంది.
వీఆర్‌వో/ వీఆర్‌ఏ పరీక్షలకు సర్వశక్తులు ఒడ్డుతూనే తక్కువ పోటీ ఉండే పంచాయతీ కార్యదర్శిపై కూడా దృష్టిపెట్టి, సన్నద్ధమైతే తక్కువ సమయంలోనే రెండు ఉద్యోగాలూ పొందవచ్చు.

– కొడాలి భవానీ శంకర్
 
Comments Off on రెండు పరీక్షల ఉమ్మడి వ్యూహం!

Posted by on January 13, 2014 in Uncategorized

 

1657 వీఆర్‌వో ఉద్యోగాలు…13.08 లక్షల మంది అభ్యర్థులు


1657 వీఆర్‌వో ఉద్యోగాలు…13.08 లక్షల మంది అభ్యర్థులు

* పరీక్షలు ఫిబ్రవరి 2న
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ శాఖ భర్తీచేయనున్న గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌వో), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 13తో గడువు ముగిసింది. వీఆర్‌వో ఉద్యోగాలు 1,657 ఉండగా వీటికి 13,08,916 మంది దరఖాస్తు చేసుకున్నారు. సగటున ఒక్కో ఉద్యోగానికి 789 మంది పోటీపడుతున్నారు. వీఆర్ఏ ఉద్యోగాలు 4,305కు గాను 62,277 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్‌వోతోపాటు వీఆర్ఏ పోస్టులకూ కలిపి దరఖాస్తు చేసుకున్నవారిలో 37,805 మంది ఉన్నారు. పరీక్షలు ఫిబ్రవరి 2న జరుగుతాయి. 10న తుది ‘కీ వెలువడుతుంది. ఫలితాలు వెల్లడించిన తర్వాత, ఫిబ్రవరి 26న ధ్రువపత్రాల పరిశీలన, నియామక పత్రాల అందజేత ఉంటాయని అధికారులు తెలిపారు.

 
Comments Off on 1657 వీఆర్‌వో ఉద్యోగాలు…13.08 లక్షల మంది అభ్యర్థులు

Posted by on January 13, 2014 in Uncategorized

 

జూనియర్‌ అసిస్టెంట్ల జాబితా విడుదల


* 17న తిరుపతిలో ధ్రువప్రతాల పరిశీలన
గుంటూరు విద్యుత్తు, న్యూస్‌టుడే : దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ (సదరన్‌ డిస్కం) జూనియర్‌ అసిస్టెంట్లు ఎంపిక కోసం 2012 మార్చి 25 న నిర్వహించిన రాతపరీక్ష ఆధారంగా ప్రాథమికంగా ఎంపికైన వారి జాబితాను విడుదల చేసింది. ఈ సంస్థ పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేయడం కోసం 2011 డిసెంబరు 14న ఉద్యోగ ప్రకటన విడుదలైంది. న్యాయస్థానంలో వివాదం కారణంగా రెండేళ్లుగా ఈ పోస్టుల భర్తీ నిలిచిపోయింది. గత ఏడాది డిసెంబరు 9న కోర్టు తీర్పు రావడంతో ఎంపిక కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రాతపరీక్షలో ప్రతిభ కనబరచిన 142 మంది వివరాలను వెల్లడించారు. జనవరి 17న తిరుపతిలో 1 నుంచి 75 వరకు ఉన్న అభ్యర్థులకు ఉదయం 9 గంటలకు, మిగిలిన వారికి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్లుగా భావించరాదని ముఖ్య జనరల్‌ మేనేజరు (హెచ్‌.ఆర్‌.డి.) ఏసునాథు తెలిపారు.

 
Comments Off on జూనియర్‌ అసిస్టెంట్ల జాబితా విడుదల

Posted by on January 13, 2014 in Uncategorized

 
Image

happy pongal


pongal-504

 
Comments Off on happy pongal

Posted by on January 13, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: