RSS

Daily Archives: January 20, 2014

ఇంటర్‌లో ప్రవేశాలు పెంచాలి!


ఈనాడు-హైదరాబాద్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంటర్ విద్యకు దూరమవుతున్న విద్యార్థులను జూనియర్ కళాశాలలకు రప్పించే అంశానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఇంటర్ విద్యా శాఖ జిల్లా అధికారులను జనవరి 20న ఆదేశించింది. మాధ్యమిక విద్యా శాఖ ముఖ్య కార్యదరి రాజేశ్వర్ తివారీ నేతృత్వంలో ఇంటర్ విద్యా శాఖ కమిషనర్ అధర్‌సిన్హా, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో విద్యార్థుల ప్రవేశాలు-తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రానున్న నూతన విద్యా సంవత్సరంలో ఇంటర్‌లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ఇప్పటి నుంచే మండలం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను రాజేశ్వర్‌తివారీ, అధర్‌సిన్హా కోరారు.

Advertisements
 
Comments Off on ఇంటర్‌లో ప్రవేశాలు పెంచాలి!

Posted by on January 20, 2014 in Uncategorized

 

పంజాబ్‌లో మన ట్రిపుల్‌ఐటీ తరహా విద్యాసంస్థ


* యూజీసీ నిపుణుల కమిటీ ఛైర్మన్‌ గ్రోవర్‌
నూజివీడు, న్యూస్‌టుడే: మన రాష్ట్రంలో ఉన్న ట్రిపుల్‌ఐటీ విద్యాసంస్థ తరహాలో పంజాబ్‌లో కూడా విద్యా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు పంజాబ్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి, యూజీసీ నిపుణుల కమిటీ ఛైర్మన్‌ అరుణ్‌ కుమార్‌ గ్రోవర్‌ తెలిపారు. కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీని జనవరి 19న సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడి విద్యావిధానం బాగుందన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి అక్కడ పదోతరగతిలో 80 శాతం మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు మరింత ఉత్సాహంతో ఉన్నత విద్య నభ్యసించాలనే ఆలోచనతో హర్‌గోవింద్‌సింగ్‌ ఖురానా పథకం కింద రూ.3 వేలు చొప్పున అందజేస్తున్నారన్నారు. అయితే ఆ సొమ్మును తల్లిదండ్రులు సొంత అవసరాలకు వినియోగించుకుంటోడంటంతో పథకం లక్ష్యం నెరవేరడం లేదన్నారు. ఈ నేపధ్యంలో ట్రిపుల్‌ఐటీల గురించి విన్న అక్కడి సీఎం మన ట్రిపుల్‌ఐటీ తరహా విద్యాసంస్థను ఏర్పాటుచేయడానికి నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

 
Comments Off on పంజాబ్‌లో మన ట్రిపుల్‌ఐటీ తరహా విద్యాసంస్థ

Posted by on January 20, 2014 in Uncategorized

 

2011 గ్రూప్‌1 మెయిన్స్‌ మళ్లీ నిర్వహించాలి: సుప్రీంకోర్టు


2011 గ్రూప్‌1 మెయిన్స్‌ మళ్లీ నిర్వహించాలి: సుప్రీంకోర్టు

హైదరాబాద్‌: 2011 గ్రూప్‌ 1 మెయిన్స్‌ను మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టు జనవరి 20న స్పష్టంచేసింది. హాజరుకాని 7 వేల మందిని మినహాయించి మిగతా వారికి పరీక్ష నిర్వహించేలా ఏపీపీఎస్సీకి వెసులుబాటు కల్పించింది. తప్పులు దొర్లిన వివాదంలో నష్టపోయిన 209 మందిని ఈసారి నిర్వహించే మెయిన్స్‌లో చేర్చాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుపై 209 మంది అభ్యర్థులు హర్షం వ్యక్తంచేశారు. 2011 నవంబర్‌లో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకారం 2012 మే 27న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. ఇందుకు సుమారు 1.70 లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు. 2012 సెప్టెంబర్ 18 నుంచి 30 వరకు ఏపీపీఎస్సీ.. మెయిన్స్ నిర్వహించింది. 2013 జనవరి నుంచి మార్చి వరకు ఇంటర్వ్యూలు జరిగాయి.

 
Comments Off on 2011 గ్రూప్‌1 మెయిన్స్‌ మళ్లీ నిర్వహించాలి: సుప్రీంకోర్టు

Posted by on January 20, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: