RSS

పంజాబ్‌లో మన ట్రిపుల్‌ఐటీ తరహా విద్యాసంస్థ

20 Jan

* యూజీసీ నిపుణుల కమిటీ ఛైర్మన్‌ గ్రోవర్‌
నూజివీడు, న్యూస్‌టుడే: మన రాష్ట్రంలో ఉన్న ట్రిపుల్‌ఐటీ విద్యాసంస్థ తరహాలో పంజాబ్‌లో కూడా విద్యా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు పంజాబ్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి, యూజీసీ నిపుణుల కమిటీ ఛైర్మన్‌ అరుణ్‌ కుమార్‌ గ్రోవర్‌ తెలిపారు. కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీని జనవరి 19న సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడి విద్యావిధానం బాగుందన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి అక్కడ పదోతరగతిలో 80 శాతం మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు మరింత ఉత్సాహంతో ఉన్నత విద్య నభ్యసించాలనే ఆలోచనతో హర్‌గోవింద్‌సింగ్‌ ఖురానా పథకం కింద రూ.3 వేలు చొప్పున అందజేస్తున్నారన్నారు. అయితే ఆ సొమ్మును తల్లిదండ్రులు సొంత అవసరాలకు వినియోగించుకుంటోడంటంతో పథకం లక్ష్యం నెరవేరడం లేదన్నారు. ఈ నేపధ్యంలో ట్రిపుల్‌ఐటీల గురించి విన్న అక్కడి సీఎం మన ట్రిపుల్‌ఐటీ తరహా విద్యాసంస్థను ఏర్పాటుచేయడానికి నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

 
Comments Off on పంజాబ్‌లో మన ట్రిపుల్‌ఐటీ తరహా విద్యాసంస్థ

Posted by on January 20, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: