RSS

31 నుంచి అందుబాటులో టెట్ హాల్‌టిక్కెట్లు

22 Jan

ఈనాడు, హైదరాబాద్: ఫిబ్రవరి 9న జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్‌టిక్కెట్లను జనవరి 31 నుంచి ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు విద్యాశాఖ జనవరి 22న ఒక ప్రకటనలో తెలిపింది. వెబ్‌సైట్ నుంచి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పరీక్ష నిర్వహణపై సమాచారం కావాలంటే 040-23232340, 23232349 నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని సూచించింది. ఉదయం పేపర్ – 1, మధ్యాహ్నం పేపర్ – 2 పరీక్షలు జరగనున్నాయి.

 
Comments Off on 31 నుంచి అందుబాటులో టెట్ హాల్‌టిక్కెట్లు

Posted by on January 22, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: