RSS

త్వరలో సిండికేట్‌ బ్యాంకులో 5వేల పోస్టుల భర్తీ

26 Jan

తూర్పు గోదావరి జిల్లా (వెదురుపాక): వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3 వేల మంది ఆఫీసర్లు, 2 వేల మంది క్లరికల్‌ సిబ్బంది నియామకానికి చర్యలు చేపడుతున్నట్లు సిండికేట్‌ బ్యాంకు ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌(ఈడీ) ఎం.ఆంజనేయప్రసాద్‌ జనవరి 24న తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని వెదురుపాక విజయదుర్గాపీఠాన్ని సందిర్శించేందుకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. త్వరలో జిల్లాలో మరో పది శాఖలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం 462 శాఖలున్నాయని, మరో 38 శాఖలను ఏర్పాటు చేస్తామని ఈడీ తెలిపారు.

Advertisements
 
Comments Off on త్వరలో సిండికేట్‌ బ్యాంకులో 5వేల పోస్టుల భర్తీ

Posted by on January 26, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: