RSS

Daily Archives: January 28, 2014

విశాఖ- శ్రీకాకుళం మధ్య కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం!


బాపట్ల: సీమాంధ్ర ప్రాంతంలో కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి, ఆచార్యులు ఎ.పద్మరాజు అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆయన జనవరి 27న విలేకరులతో మాట్లాడుతూ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేదీ నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందన్నారు. విశ్వవిద్యాలయ పాలకవర్గ సభ్యులు అల్దాస్‌ జానయ్య మాట్లాడుతూ 12వ పంచవర్ష ప్రణాళికలో దేశంలో ఐదు కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని విధానపత్రంలో పేర్కొన్నారని తెలిపారు. ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో వెనుకబడ్డ ప్రాంతాలకు సమీపంలో ఉండే విశాఖపట్టణం, శ్రీకాకుళం మధ్య వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు.

Advertisements
 
Comments Off on విశాఖ- శ్రీకాకుళం మధ్య కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం!

Posted by on January 28, 2014 in Uncategorized

 

దేశంలోని ప్రతి జిల్లాలో క్రీడా పాఠశాల


 

* జీఎస్‌జీ అయ్యంగార్‌
బాపట్ల, న్యూస్‌టుడే: దేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయాలని ప్రణాళిక రూపొందించిందని కేంద్ర క్రీడల, యువజన వ్యవహారాల సంయుక్త కార్యదర్శి జీఎస్‌జీ అయ్యంగార్‌ చెప్పారు. గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలలో జనవరి 27న ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి రెండు లక్షల మందికి ఓ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో పది ఎకరాల స్థలంలో రూ. 30 కోట్లతో క్రీడా పాఠశాల ఏర్పాటు చేసి చిన్నతనం నుంచే వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచే వారికి శిక్షణ, అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఉన్న క్రీడా పాఠశాలలను ఆధునికీకరిస్తామన్నారు. క్రీడల అభివృద్ధికి రూ. 50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వ్యయంతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. 2024 ఒలింపిక్స్‌లో మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు కనీసం 25 పతకాలకు తగ్గకుండా సాధించేలా ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. రానున్న పదేళ్లలో ఏడాదికి రూ.3 వేల కోట్లు చొప్పున, మొత్తం రూ.30 వేల కోట్లు ఖర్చుచేయటానికి ఇన్‌స్టాల్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు వివరించారు. రూ.వెయ్యి కోట్లతో ఆధునిక క్రీడా పరికరాలు కొనుగోలు చేసి క్రీడాకారులు సాధన చేయడానికి శిక్షణా సంస్థల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. గిరిజన, కొండ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రత్యేకంగా శిక్షణ, వసతి, ఇతర సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు.

 

 
Comments Off on దేశంలోని ప్రతి జిల్లాలో క్రీడా పాఠశాల

Posted by on January 28, 2014 in Uncategorized

 

2025 నాటికి యువశక్తిగా భారత్‌


కేంద్ర మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు
* రూ.180 కోట్లతో కాకినాడ ట్రిపుల్‌ ఐటీకి శంకుస్థాపన
ఈనాడు, కాకినాడ: భారతదేశం 2025 నాటికి ప్రపంచంలోనే అత్యంత యువశ్రామిక శక్తిగా అవతరిస్తుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి ఎం.ఎం.పళ్లంరాజు పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మక ట్రిపుల్‌ ఐటీ శిలాఫలకాన్ని కాకినాడ జేఎన్‌టీయూకే క్రీడామైదానంలో జనవరి 27న మంత్రి పళ్లంరాజు ఆవిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో సుమారు రూ.180 కోట్లతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. పీపీపీ విధానంలో నిర్మించనున్న ఈ ట్రిపుల్‌ ఐటీలో నాలుగు సంస్థలు పారిశ్రామిక భాగస్వామ్యులుగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి పళ్లంరాజు మాట్లాడారు. ప్రధానమంత్రి జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం కింద 2025 నాటికి 50 కోట్ల మంది యువతకు నైపుణ్యాలపై శిక్షణనిచ్చి మెరుగైన ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. కొత్తగా ఏర్పాటుకానున్న 20 ట్రిపుల్‌ ఐటీల్లో కాకినాడ ట్రిపుల్‌ ఐటీ తొలిసారిగా ఆవిష్కరణకు నోచుకోవడం విశేషమన్నారు. ఇది రాష్ట్రంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.

 
Comments Off on 2025 నాటికి యువశక్తిగా భారత్‌

Posted by on January 28, 2014 in Uncategorized

 

కేంద్రీయ విద్యాలయ్యాల్లో వారానికి 5 రోజులే బడి!


న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారానికి ఐదు రోజులు మాత్రమే తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. జనవరి 28న ఢిల్లీలో జరగనున్న కేంద్రీయ విద్యాలయ సంఘటన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఆర్‌టీఈ చట్టం ప్రకారం ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు ఏడాదికి 200 రోజులు, ఆపై తరగతుల వారికి 220 రోజులు పనిదినాలుగా ఉండాలి. అంటే వారానికి ఐదురోజు తరగతులు సరిపోతాయి. స్వయంగా నేర్చుకోవడం, తమ అభిరుచులపై శ్రద్ధ పెట్టేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు దీనిపై ఏర్పాటయిన కమిటీ పేర్కొంది.

 
Comments Off on కేంద్రీయ విద్యాలయ్యాల్లో వారానికి 5 రోజులే బడి!

Posted by on January 28, 2014 in Uncategorized

 

అటవీశాఖలో 2547 ఖాళీల భర్తీకి రంగం సిద్ధం!


అటవీశాఖలో 2547 ఖాళీల భర్తీకి రంగం సిద్ధం!

* ఫిబ్రవరిలో నోటిఫికేషన్
ఈనాడు, హైదరాబాద్: అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. మూడేళ్ల వ్యవధిలో 3,820 పోస్టుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించడంతో… తొలి రెండేళ్లకు సంబంధించిన 2,547 పోస్టులను త్వరలోనే భర్తీ చేయాలని అధికారులు జనవరి 27న నిర్ణయించారు. ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రేంజి ఆఫీసర్, సహాయ బీట్ ఆఫీసర్, తదితర పోస్టులను భర్తీ చేయనుండటంతో అటవీ శాఖ బలోపేతం కానుంది. ఈ నియామక ప్రక్రియలో… దరఖాస్తు స్థాయి నుంచి పరీక్ష నిర్వహణ వరకు జేఎన్‌టీయూకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. దీనిపై త్వరలోనే అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేయనున్నారు.
* టెన్త్, ఇంటరే అర్హతలు
పోస్టుల భర్తీకి కనీస విద్యార్హత పదో తరగతి, ఇంటర్మీడియట్ కావటంతో లక్షల్లో దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. సహాయ బీట్ ఆఫీసర్ పోస్టులకు పదో తరగతి కనీస విద్యార్హతగా నిర్ణయించారు. బీట్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్మీడియట్ కనీస విద్యార్హత. నియామకపు ప్రక్రియను మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి బి.సోమశేఖరరెడ్డి ‘ఈనాడుతో చెప్పారు. ఈసేవా, మీ సేవా కేంద్రాలలో అభ్యర్థులు దరఖాస్తులను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

 
Comments Off on అటవీశాఖలో 2547 ఖాళీల భర్తీకి రంగం సిద్ధం!

Posted by on January 28, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: