RSS

నెలాఖరులోగా ఆచార్యుల భర్తీకి ప్రకటన

29 Jan

నెలాఖరులోగా ఆచార్యుల భర్తీకి ప్రకటన
కర్నూలు ( రాయలసీమ విశ్వవిద్యాలయం): రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది భర్తీకి జనవరి 31లోగా ప్రకటన జారీ చేయనున్నట్లు ఉపకులపతి ఆచార్య కె.కృష్ణనాయక్‌ పేర్కొన్నారు. జనవరి 28న సిల్వర్‌జూబ్లీ కళాశాలలో జరుగుతున్న జాతీయ సెమినార్‌లో పాల్గొనడానికి వచ్చిన ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. విశ్వవిద్యాలయానికి మొత్తం 49 పోస్టులు మంజూరయ్యాయన్నారు. ఇందులో ఆచార్యులు 7, అనుబంధ ఆచార్యులు 14, సహాయ ఆచార్యులు 28 ఉన్నాయన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తి అయిందని, ప్రకటన విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పెడతామన్నారు.

 
Comments Off on నెలాఖరులోగా ఆచార్యుల భర్తీకి ప్రకటన

Posted by on January 29, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: