RSS

Monthly Archives: February 2014

54 new KVs, 3500 model schools to be set up


54 new KVs, 3500 model schools to be set up
Last Updated: Friday, February 28, 2014, 15:55

New Delhi: The Government on Friday approved opening of 54 new Kendriya Vidyalayas (KVs) benefiting 54,000 students during 12th Plan Period and 3500 model schools with three-fourth funding by Centre and rest by the states.

According to the proposal approved by the Cabinet Committee on Economic Affairs, the 54 KVs will be located in 53 districts in 17 states.

While the cost of opening these institutes would be Rs 927.40 crore, non-recurring costs covering constructions cost, furniture, fixture will be Rs 793.58 crore and recurring cost covering pay and allowance and other expenses will be Rs 133.82 crore.

Per unit cost of construction of a school building is Rs 14.55 crore, said a government statement.

These new KVs when fully functional will provide quality education to approximately 54,000 students in addition to 12 lakhs students already studying in the present KVs, it said.

There are at present 1,094 functional KVs including three in Moscow, Kathmandu and Tehran.

The Cabinet Committee on Economic Affairs also approved setting up of 3500 model schools in educationally backward blocks in 27 states/UTs and continue with the funding pattern of 75:25 between the Centre and the state during the 12th Plan Period.

Earlier, the funding pattern of 75:25 was for 2012-13.

This is under the scheme for setting up of 6000 model schools at block level as a benchmark of excellence. The rest will be set up under PPP mode.

For the year 2013-14, an amount of Rs 1000 crore has been allocated under the scheme.

Each school will have 560 students and the total beneficiaries for 3500 schools would be 19.60 lakh students.

Jammu and Kashmir will be allowed to revise the cost based on ‘state schedule of rates’ for the already sanctioned 19 model schools as a one time exception.

PTI

First Published: Friday, February 28, 2014, 15:55

Advertisements
 
Comments Off on 54 new KVs, 3500 model schools to be set up

Posted by on February 28, 2014 in Uncategorized

 
Image

science day celebrations in our school


1508615_829747457050765_1573534692_n

 
Comments Off on science day celebrations in our school

Posted by on February 28, 2014 in Uncategorized

 

అందుకోండి..అడవి ‘కొలువులు’


అందుకోండి..అడవి ‘కొలువులు’

విజయనగరం అర్బన్‌ : పోలీసు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న అభ్యర్థులకు అటవీ ఉద్యోగాలు ఆశలు కల్పిస్తున్నాయి. ఏడాదికాలంగా పోలీసు ఉద్యోగప్రకటన లేకపోవడంతో ఎదురుచూస్తున్న అభ్యర్థులు ప్రత్యామ్నాయంగా అటవీశాఖ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. డిగ్రీ, ఐటీఐలతో పాటు పది, ఇంటర్‌ అర్హతలతో పోటీపడే అవకాశంతో జిల్లాల నుంచి సిద్ధమయ్యే అభ్యర్థుల సంఖ్య పెరగనుంది.
* జోనల్‌స్థాయిలో ఎంపిక
అటవీ రేంజరు, సెక్షను, అటవీ బీట్‌, సహాయ బీట్‌ అధికారులతో పాటు తానదార్స్‌, బంగ్లావాచ్‌మెన్‌ ఉద్యోగాలు, ఐటీఐ అభ్యర్థులకు సాంకేతిక సహాయకుల ఉద్యోగాలకు ప్రకటనలు జారీ అయ్యాయి. మొదటి రెండు ఉద్యోగాలకు డిగ్రీ, బీట్‌ అధికారుల ఉద్యోగానికి ఇంటర్‌, మిగిలిన వాటికి పదోతరగతి అర్హతగా పేర్కొన్నారు. ఉద్యోగాలకు ఎంపిక విధానం జోనల్‌ స్థాయిలో ఉంటోంది. పురుషులతో పాటు స్త్రీలకు పోటీపడే అవకాశం కల్పించారు. వయోపరిమితి మినహాయింపుతో పోటీ పెరగవచ్చనేది వ్యక్తమవుతున్నా పరిమితఖాళీలు పోటీపై ప్రభావాన్ని చూపుతుతున్నాయి.
* పరుగు పందెం స్థానంలో నడకపోటీ
రాత పరీక్ష, శారీరకసామర్ధ్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ముందుగా రాతపరీక్ష జరుగుతుంది. ఎంపికైన వారికి 1 : 2 నిష్పత్తిలో శారీరకసామర్ధ్యపరీక్షకు ఎంపిక చేస్తారు. శారీరక సామర్థ్య పరీక్ష పోలీసు ఉద్యోగాలకు కొంత భిన్నంగా ఉంటుంది. పరుగుపందెం స్థానంలో నడకను అమలు చేస్తున్నారు. 25 కిలోమీటర్ల దూరాన్ని నాలుగుగంటలు, మహిళలకైతే 16 కిలో మీటర్ల దూరాన్ని నాలుగు గంటల్లో పూర్తి చేయాలి. ఎత్తు, ఛాతీ విషయంలో పోలీసు ఉద్యోగాలకంటే కొంత వెలుసుబాటు ఉంటుంది. ఎత్తు 163 సెం.మీ, ఛాతీ 79 + 5 విషయంలో మహిళలకు కొంత మినహాయింపు ఇస్తారు. సాంకేతిక విద్యార్థులకు శారీరక పరీక్షలు ఉండవు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం
ఉద్యోగాలకు మార్చి మూడోతేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థి ఫోటో, సంతకం, పదోతరగతి ధ్రువపత్రం, కులపత్రం, మెడికల్‌ ధ్రువపత్రం తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో స్కాన్‌ చేయాలి. జనరల్‌, ఓబీసీ కేటగిరీలకు ఒక్కో పోస్టుకు రూ.300 రుసుం చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ.150 పోస్టులకు విడివిడిగా చెల్లించాలి. * పోలీసు తరహాలోనే అటవీశాఖ విధులు అటవీశాఖ అధికారులు, సిబ్బంది పోలీసు తరహాలోనే విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. అటవీ సంపద పరిరక్షించే దిశగా ఆశాఖ పనిచేస్తుంది. ఇందుకు పోలీసు తరహాలోనే ఖాకీ దుస్తులు ధరించి విధులు అడవుల్లో నిర్వర్తిస్తారు. పోలీసుస్టేషన్ల తరహాలోనే అటవీశాఖ సిబ్బందికి కూడా పరిధులు కేటాయిస్తారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయా పోస్టుల కోసం నిరుద్యోగ యువత పోటీ పడుతున్నారు. ఈ శాఖలో సహాయ బీట్‌ ఆఫీసరు, బీట్‌ఆఫీసరు, సెక్షన్‌ ఆఫీసరు, డిప్యూటీ రేంజరు, రేంజర్లు ఉంటారు. వీరందరికి పర్యవేక్షణాధికారిగా జిల్లా అటవీశాఖాధికారి వ్యవహరిస్తారు.ఈ శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది నిత్యమూ అప్రమత్తంగా వ్యవహరించాలి.అటవీ సంపదను కాపాడటం, అభివృద్ధి పర్చడంతోపాటు దొంగలను పట్టుకొనేందుకు గస్తీలు తిరగాల్సి వస్తుంది. ఒక్కొక్క బీట్‌ ఆఫీసరుకు 1000 నుంచి 1500 హెక్టార్ల అటవీ పరిధి ఉంటుంది. ఆయా ప్రాంతంలో కలప నేరాలను నియంత్రించాలి. గస్తీచేసే వివరాలను నిత్యమూ డైరీలో నమెదు చేసుకుని ఆయా ప్రాంతాల్లో జరిగే ప్రతీ విషయాన్ని అధికారులకు తెలియజేయాలి. అక్రమ కలప, అటవీ దొంగల కదలికలపై ఎప్పటికప్పుడు సహాయ, బీట్‌ ఆఫీసర్లు సమాచారం ఇవ్వాల్సి ఉంది. సెక్షన్‌ ఆఫీసరు పరిధిలో ఈ బీట్‌ ఆఫీసర్లు పని చేస్తారు. రోజురోజుకు పెరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు, అటవీ జంతుల నుంచి రక్షణ పొందడానికి అటవీశాఖ అధికారులు, సిబ్బందికి కూడా ఆయుధాలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీట్‌ ఆఫీసర్ల పోస్టులకు పురుషులతో పాటు మహిళలు పోటీ పడుతున్నారు. ఆయా పోస్టుల భర్తీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఉంది. దీంతో మహిళల ముందుకొస్తున్నారు.

 
Comments Off on అందుకోండి..అడవి ‘కొలువులు’

Posted by on February 28, 2014 in Uncategorized

 
Image

Inter Hall Tickets


1979723_574106242686023_142278665_n

 
Comments Off on Inter Hall Tickets

Posted by on February 28, 2014 in Uncategorized

 
Image

national science day


national_science_day_wallpapers

 
Comments Off on national science day

Posted by on February 28, 2014 in Uncategorized

 
Image

first post office ATM


20140228a_003101001

 
Comments Off on first post office ATM

Posted by on February 28, 2014 in Uncategorized

 

ఉద్యోగాభ్యాసం


ఉద్యోగాభ్యాసం

* ఎంపికైన విద్యార్థులకు కళాశాల దశలోనే కొలువు శిక్షణ
* ఇతర ఉద్యోగులతో పాటు పనిచేసే అవకాశం
* సమయం, ఖర్చు తగ్గించుకునేందుకు సంస్థల కొత్త పంథా
* సహకరిస్తున్న కాలేజీలు.. లబ్దిపొందుతున్న విద్యార్థులు
రవితేజ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విద్యార్థి. ఇంజినీరింగ్‌ ఆఖరి ఏడాది మొదటి సెమిస్టర్‌లో ఉండగానే ప్రాంగణ నియామకాల్లో ఓ బహుళ జాతి సంస్థ అతణ్ని ఎంపిక చేసుకుంది. తుది పరీక్షలయ్యాక సంస్థలో చేరడానికి మానసికంగా సిద్ధమైన అతనికి ముందుగానే ఉద్యోగంలో చేరమని పిలొపొచ్చింది. సాధారణంగా ఇంజినీరింగ్‌ నాలుగేళ్లు పూర్తయ్యాక ప్రత్యేకంగా శిక్షణనిచ్చే సంస్థ.. ఆ విధానాన్ని పక్కకుబెట్టి ముందస్తు పని అనుభవాన్ని నేర్పించేందుకు చొరవ చూపింది. రవితేజ వెంటనే చేరిపోయాడు. సీనియర్లతో పాటూ పనిలో భాగం పంచుకుంటున్నాడు. శిక్షణ పొందుతూనే పని నేర్చుకుంటున్నాడు. చదువు పూర్తి కాకుండానే కొలువు చేస్తూ నెలకు రూ.12 వేలు వేతనం సంపాదిస్తున్నాడు. కళాశాల విద్య పూర్తికాగానే శిక్షణ అవసరం లేకుండా ఆయన నేరుగా ఉద్యోగంలో చేరిపోవచ్చు. ‘ఆర్నెళ్ల ముందుగానే పరిశ్రమకు ఉపయోగపడేలా తయారవడం.. సంస్థలో ప్రధాన బృందంతో పాటూ పని చేసే అవకాశం దొరకడం వల్ల సంస్థ సంస్కృతి, విధివిధానాలపై అవగాహన వస్తుంది’ అంటున్నారు రవితేజ.
నియామకాల్లో కొన్ని బహుళ జాతి సంస్థలు అనుసరిస్తున్న నయా ధోరణి ఇది. ఎంపిక చేసుకున్న విద్యార్థిని కళాశాల దశలోనే తమ అవసరాలకు తగ్గట్లుగా మలచుకుంటున్నాయి. చదువు పూర్తయ్యాక ఆర్నెళ్ల పాటు శిక్షణ ఇవ్వడానికి బదులుగా చదువుతో పాటే పని అనుభవాన్నీ నేర్పించేస్తున్నాయి. తమ ఆవరణలోనే ఇతర ఉద్యోగులతో పాటు కలిసి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇంకొన్ని సంస్థలు ఎంపిక చేసుకున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక సిలబస్‌ అందజేసి నిర్ణీత కాల వ్యవధిలో ఆ అసైన్‌మెంట్లు పూర్తిచేయాల్సిందిగా ఆదేశిస్తున్నాయి. ఈ విషయంలో విద్యార్థులకు కళాశాలలూ సహకరిస్తున్నాయి. ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేసి శిక్షణ ఇస్తున్నాయి.
ఏమిటీ ఆన్‌లైన్‌ శిక్షణ..?: ఎంపికైన విద్యార్థులకు శిక్షణకు సంబంధించిన వివరాలను సంస్థలు ఈమెయిల్‌లో పంపిస్తుంటాయి. ఉదాహరణకు జావా ప్రోగ్రామింగ్‌లో పని చేయాల్సి ఉన్నప్పుడు.. సంబంధిత సిలబస్‌ పంపించి ఏయే అంశాల్లో తర్ఫీదు పొందాలో నిర్దేశిస్తాయి. ఆన్‌లైన్‌లోనే విద్యార్థి ఆ పనిని నిర్ణీత కాల పరిమితిలో పూర్తిచేయాల్సి ఉంటుంది. దాదాపు పెద్ద కంపెనీలన్నీ ఈ విధానాన్ని ‘కస్టమైజ్డ్‌‌ వర్క్‌ ఫోర్స్‌ డెవలప్‌మెంట్‌’ అంటారు. ‘ఇటీవల కాలంలో ఎంపికైన విద్యార్థులకు ముందస్తుగా శిక్షణ ఇచ్చే ధోరణి పెరుగుతోంది. వారి అవసరాలకు తగ్గట్లుగా ముందుగా కళాశాల అధ్యాపకులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, విద్యార్థులను ఏయే అంశాల్లో తీర్చిదిద్దాలో చెబుతున్నాయి. ఆన్‌లైన్‌ అసైన్‌మెంట్లు పూర్తి చేసేందుకు విద్యార్థికి అవసరమైన ఇంటర్నెట్‌, ఇతర మౌలిక వసతులు, నిపుణుల సహకారాన్ని మేమే అందిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి రుసుము వసూలు చేయడం లేద’ని చెబుతున్నారు శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఇండస్ట్రీ రిలేషన్స్‌ డైరెక్టర్‌ సతీష్‌చంద్ర పరుచూరి.
ముందస్తు అనుభవం: సాధారణంగా విద్యార్ధులు నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్‌లో ఉన్నప్పుడు అక్టోబరు-జనవరి మధ్య కాలంలో ప్రాంగణ నియామకాలు జరుగుతుంటాయి. అప్పుడు ఎంపికైన విద్యార్థికి ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత ఉద్యోగంలోకి తీసుకోవడం పాత పద్ధతి. ఉదాహరణకు అక్టోబరులో ఎంపికైన విద్యార్థికి మళ్లీ అక్టోబరు-డిసెంబరులోగానీ ఉద్యోగంలో చేరే అవకాశం రాదు. నైపుణ్యాన్ని బట్టి మూడు నెలల నుంచి ఆర్నెళ్ల ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అయితే ఇప్పుడు కొన్ని సంస్థలు ఆ కాల పరిమితిని తగ్గించే క్రమంలో ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన వెంటనే పని అనుభవాన్ని నేర్పించేందుకు ఇలా సిద్ధపడుతున్నాయి. ‘నేను యాడ్‌ట్రాన్‌లో చేరా. ప్రాజెక్టులో సీనియర్లతో పాటూ కలిసి పనిచేస్తున్నా. ప్రత్యేకంగా క్యాబిన్‌, సిస్టమ్‌ ఇచ్చారు. 9 గంటలు పనిచేస్తున్నా. కాలేజీలో పరీక్షలు, సెమినార్లు జరుగుతున్నప్పుడు ఇక్కడ అనుమతి తీసుకొని వెళ్తున్నా. కాలేజీ యాజమాన్యం కూడా సహకరిస్తోంది’ అని చెబుతోంది కేశవ్‌ మెమోరియల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(కేఎంఐటీ)లో కంప్యూటర్‌ సైన్సు చదువుతున్న కావ్య.
ఉభయతారకంగా..: ఈ విధానంలో ఇటు సంస్థకు, అటు విద్యార్థికీ ఇద్దరికీ లాభమే. ‘ఈ ముందస్తు శిక్షణ వల్ల దాదాపు 60-70 శాతం మేరకు ఖర్చు, సమయం ఆదా అవుతాయి’ అని చెబుతున్నారు ‘మహీంద్ర సత్యం’ మానవ వనరుల విభాగం ప్రతినిధి సత్య.
సంస్థకు..: కళాశాల దశలోనే విద్యార్థికి శిక్షణ ఇవ్వడం వల్ల మళ్లీ ప్రత్యేకంగా ఇప్పించాల్సిన అవసరం ఉండదు.
* ఆర్నెళ్ల ముందుగానే అభ్యర్థి ఉద్యోగావసరాలకు సరిపడేలా తయారవుతారు.
* డబ్బూ, సమయమూ రెండూ ఆదా అవుతాయి.
* ఎంపిక చేసుకున్న విద్యార్థి సామర్థ్యాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు.
విద్యార్థికి..
* ప్రాజెక్ట్‌ వర్క్‌ను చదువుతోపాటే ముగించొచ్చు.
* కళాశాల నుంచి బయటకు రాగానే నేరుగా విధుల్లో చేరిపోవచ్చు.
* బెంచీపై వేచిఉండాల్సిన అవసరం ఉండదు.
* సంస్థ సంస్కృతి, విధివిధానాలపై అవగాహన వస్తుంది.

 
Comments Off on ఉద్యోగాభ్యాసం

Posted by on February 27, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: