RSS

Daily Archives: February 1, 2014

అందుబాటులో టెట్ హాల్‌టికెట్లు


హైదరాబాద్: ఫిబ్రవరి 9న జరగనున్న టెట్ పరీక్షల హాల్‌టికెట్లను వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని సంబంధిత వర్గాలు జనవరి 31న పేర్కొన్నాయి. పరీక్ష నిర్వహణపై శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ వాణీమోహన్.. జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు.

Advertisements
 
Comments Off on అందుబాటులో టెట్ హాల్‌టికెట్లు

Posted by on February 1, 2014 in Uncategorized

 

విద్యాలయం సౌర విద్యుత్తుకు నిలయం కావాలి


 

* రాష్ట్రంలోనేతొలిసారిఅనంతలోశ్రీకారం
* ఉన్నతవిద్యామండలిఅధ్యక్షులుఆచార్యఎల్.వేణుగోపాల్‌రెడ్డి

 

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: విద్యాలయాల్లో సౌరశక్తితో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తే తగిన మినహాయింపులు ఉంటాయని ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ఆచార్య ఎల్.వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలోని శ్రీ సాయిబాబా జాతీయ కళాశాలలో సౌర శక్తి ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.80లక్షలతో కళాశాలలో 70 కిలో వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ను ఫిబ్రవరి 1న ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యాలయాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడే సమాజానికి మార్గదర్శకంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపురంలో స్వయం ప్రతిపత్తి ఉన్న ఎస్ఎస్‌బీఎన్ కళాశాలలో ప్రారంభించడం అభినందనీయం అన్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చామని మరిన్ని కొత్త పోస్టులు మంజూరు చేయబోతున్నామన్నారు.

 
Comments Off on విద్యాలయం సౌర విద్యుత్తుకు నిలయం కావాలి

Posted by on February 1, 2014 in Uncategorized

 

Integration”Lead India Teacher-The Nation Building Programme”-Conducting District Level Training Programme to the Principals and Teachers of Model Schools in the State-Deputation of teachers and Principals


the nation building programme

 
Comments Off on Integration”Lead India Teacher-The Nation Building Programme”-Conducting District Level Training Programme to the Principals and Teachers of Model Schools in the State-Deputation of teachers and Principals

Posted by on February 1, 2014 in Uncategorized

 

పౌరులను తయారు చేయాలి


* సీబిఐ ఐజీ లక్ష్మీనారాయణ
చీమకుర్తి, న్యూస్‌టుడే: విద్యార్థులను వ్యక్తులుగా కాకుండా మంచి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా విద్యా విధానం ఉండాలని… ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సీబిఐ ఐజీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాజీవ్‌ విద్యామిషన్‌ ఆధ్వర్యంలో జనవరి 30న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ దేశంలోనైనా శాశ్వత మార్పు విద్యా విధానం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. చిన్నదేశమైన జపాన్‌ ఆయా రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందంటే దానికి కారణం అక్కడ ప్రజలు వ్యక్తులుగా కాక పౌరులుగా ఉండటమేనన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యపుస్తకంలోని పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పించాలని లక్ష్మీనారాయణ సూచించారు. ప్రపంచంలో ఎంతో గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తేనని… ఒకతరాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే ఉందన్నారు. పిల్లల్లో ప్రచండమైన శక్తి దాగి ఉంటుందని దానిని వెలికితీసి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. విద్య వినయాన్ని… చదువు సంస్కారాన్ని నేర్పించాలన్నారు. పూర్వ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న పాఠ్యపుస్తకాలు విద్యార్థుల్లో శాస్త్రీయ భావనలు పెంపొందించేవిగా ఉన్నాయన్నారు. ఇప్పుడు భారత దేశానికి అద్భుతమైన శాస్త్రవేత్తల అవసరం ఉందని ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు.

 
Comments Off on పౌరులను తయారు చేయాలి

Posted by on February 1, 2014 in Uncategorized

 

ప్రతిభకే పట్టం కడతాం!


ప్రతిభకే పట్టం కడతాం!

* వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
* ఓఎంఆర్ షీటు ప్రతిని తీసుకెళ్లొచ్చు
– మంత్రి రఘువీరారెడ్డి వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ”ప్రతిభను నమ్ముకోండి….వీఆర్వో… వీఆర్ఏ పరీక్షల్లో వందశాతం ప్రతిభకే పట్టం కడతాం. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేశాం. పుకార్లను నమ్మవద్దు” అని రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి లక్షలాది మంది వీఆర్వో, వీఆర్ఏ అభ్యర్థులను ఉద్దేశించి జనవరి 31న స్పష్టం చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. రాజకీయ నాయకుల పేర్లు లేదా వారి బంధువుల పేర్లు, అధికారుల పేర్లు చెప్పి మోసం చేసేవారి మాటలు నమ్మవద్దన్నారు. సచివాలయంలో శుక్రవారం భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ ఐ.వై.ఆర్.కృష్ణారావుతో కలసి మంత్రి విలేఖరులతో మాట్లాడారు. ఫిబ్రవరి నెలాఖరుకు ఉద్యోగ నియామకాలు పూర్తవుతాయన్నారు. పరీక్షకు ముందు, లేదా పరీక్ష తర్వాత ఎవరైనా వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే నమ్మకుండా వారి వివరాలను హెల్ప్‌లైన్ ద్వారా అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. 1657 గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), 4305 గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) పోస్టులను రాతపరీక్షలో సాధించిన మార్కులతో భర్తీ చేస్తామన్నారు. ప్రతి అభ్యర్థి వేలిముద్ర వేయాల్సి ఉంటుందని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వీడియో రికార్డు ఉంటుందన్నారు. ఓఎంఆర్ షీటు ప్రతిని అభ్యర్థులు తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేశామన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని తెలిపారు. వీఆర్వో పరీక్షకు 13,49,244 మంది, వీఆర్ఏకు 1,00575 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
* నాలుగున ప్రాథమిక కీ విడుదల
ఫిబ్రవరి రెండో తేదీ పరీక్ష ముగిసిన తర్వాత నాలుగో తేదీన ప్రాథమిక కీ, పదో తేదీన తుది కీ విడుదల చేస్తామని రఘువీరారెడ్డి అన్నారు. ఫిబ్రవరి 20వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామన్నారు. 26వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన నియామక పత్రాల జారీ ఉంటుందని ఫిబ్రవరి నెలాఖరుకు నియామక ప్రక్రియ పూర్తవుతుందన్నారు.

వెబ్‌సైట్

 
Comments Off on ప్రతిభకే పట్టం కడతాం!

Posted by on February 1, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: