RSS

Daily Archives: February 2, 2014

ముగిసిన వీఆర్‌వో, వీఆర్‌ఏ రాత పరీక్షలు


 

ముగిసిన వీఆర్‌వో, వీఆర్‌ఏ రాత పరీక్షలు

* తొలి కీ 4న, తుది కీ 10న
* ఫలితాలు 20న
* నెలాఖరులోగా నియామక పత్రాలు
హైదరాబాద్‌: లక్షలాది మంది ఆసక్తిగా ఎదురు చూసిన వీఆర్‌వో, వీఆర్‌ఏ రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 12 గంటలకు వీఆర్‌వో రాత పరీక్ష, మధ్యాహ్నం 5 గంటలకు వీఆర్‌ఏ రాత పరీక్ష ముగిసింది. వీఆర్‌వో పరీక్ష ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,879 కేంద్రాల్లో ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలంలో బ్రౌన్స్‌ కళాశాలలో వీఆర్వో పరీక్షను అధికారులు నిలిపివేశారు. మొత్తం 600 మంది విద్యార్థులకు గాను 340 మందికే ప్రశ్నపత్రాలు రావడంతో పరీక్ష నిర్ణీతసమయానికి ప్రారంభం కాలేదు. దీంతో పరీక్షను కొద్దిసేపు అధికారులు వాయిదా వేశారు. ఈ సంఘటనతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఇక్కడ 11.30 గంటల నుంచి పరీక్షను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. మెదక్‌జిల్లా సిద్దిపేట మాస్టర్‌ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు.
పరీక్షాకేంద్రాన్ని పరిశీలించిన మంత్రి రఘువీరా
అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన వీఆర్వో రాత పరీక్షా కేంద్రాన్ని రెవెన్యూమంత్రి రఘువీరారెడ్డి పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… ప్రతిభ ఆధారంగానే వీఆర్వో, వీఆర్‌ఏ అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఇవాళ జరిగే పరీక్షకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 25వేల మంది పోలీసులతో పరీక్షలకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈనెల 4న ప్రాథమిక కీ, 10న తుది కీ విడుదల చేయనున్నట్లు గతంతో ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 20న ఫలితాలు వెల్లడిస్తారు. 26 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన నియామక పత్రాల జారీ ఉంటుంది. ఫిబ్రవరి నెలాఖరుకు నియామక ప్రక్రియ పూర్తవుతుంది.

 

ఈనాడు యంత్రాంగం, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) ఉద్యోగాలకు రాత పరీక్షలు ఫిబ్రవరి 2న ముగిశాయి. వీఆర్వో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నవారిలో 89.04 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీఆర్ఏ అభ్యర్థుల్లో 90.15 శాతం మంది పరీక్ష రాశారు. వీఆర్వో పరీక్షల్లో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 93.61 శాతం మంది పరీక్షలు రాయగా వరంగల్ జిల్లాలో 92.62 శాతం మంది రాశారు. ప్రకాశం జిల్లాలో 82.08 శాతం రాశారు. 11 జిల్లాలో 90 శాతం కంటే ఎక్కువమంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీఆర్వో ఉద్యోగాలు 1657 ఉండగా 11,84,234 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. సగటున ఒక్కో వీఆర్వో ఉద్యోగానికి 714 మంది పోటీపడుతున్నారు. వీఆర్ఏ ఉద్యోగాలు 4305కు 88,609 మంది పరీక్ష రాయగా ఒక్కో ఉద్యోగానికి సగటున 20 మంది పోటీపడుతున్నారు. ప్రశ్నపత్రాలు తక్కువ రావడంతో కొన్ని కేంద్రాల్లో పరీక్ష ఆలస్యమైంది. అక్కడక్కడా ఒకరి స్థానంలో మరొకరు పరీక్షలు రాస్తూపట్టుబడ్డారు. ఫిబ్రవరి 20న ఫలితాలు వెలువడతాయి.
* ఓఎంఆర్ షీట్ల స్కానింగ్
మొదలైంది
వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాలకు మొత్తం 12.72 లక్షల మంది రాశారు. 20వ తేదీన పరీక్షా ఫలితాలు వెల్లడించి, ఉద్యోగ నియామకాలను ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో పరీక్షల అనంతర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ఆదివారమే మొదలైంది
.
* కటాఫ్ మార్కులు ఎక్కువే… జనరల్ నాలెడ్జ్‌కే
ప్రాధాన్యం
వీఆర్ఓ పరీక్ష ప్రశ్నపత్రం సులభంగా ఉందని అధిక శాతం మంది అభ్యర్థులు అభిప్రాయపడుతున్నా సిలబస్‌కు దూరంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. జనరల్ స్టడీస్‌లో గ్రామీణ పరిస్థితులపై 30 మార్కులుంటాయని సిలబస్‌లో పేర్కొన్నా దాన్ని పట్టించుకోకుండా ప్రశ్నపత్రం రూపొందించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రశ్నపత్రం సులభంగా ఉందన్న అభిప్రాయం ఉండటంతో ఈసారి కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Advertisements
 
Comments Off on ముగిసిన వీఆర్‌వో, వీఆర్‌ఏ రాత పరీక్షలు

Posted by on February 2, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: