RSS

మన విద్యార్థులకు రూ.10 కోట్ల ఉపకారవేతనాలు

05 Feb

* గ్రేట్ స్కాలర్‌షిప్ పై బ్రిటీష్ కౌన్సిల్ ప్రచారం
ఈనాడు, హైదరాబాద్: భారత విద్యార్థులకు బ్రిటీష్ కౌన్సిల్ ఫిబ్రవరి 4న గ్రేట్ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల్లోని 260 యూజీ, పీజీ కోర్సులకు రూ.10 కోట్ల విలువైన 370 ఉపకారవేతనాలను అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బ్రిటీష్ కౌన్సిల్ ప్రచారం ప్రారంభించింది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో గ్రేట్ స్కాలర్‌షిప్, గ్రేట్ కెరీర్ గైడ్‌ను ప్రారంభించారు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ మార్కెటింగ్ సౌత్ ఆసియా ప్రాంతీయ సంచాలకురాలు ఒట్టోలీ వెకెజెర్ ఈ గైడ్‌ను ఆవిష్కరించారు. 2014 సెప్టెంబరు- 2015 జనవరి మధ్య ప్రవేశాలు పొందే వారికి ఈ ఉపకారవేతనాలను అందజేస్తారని తెలిపారు. బ్రిటన్‌లో మొత్తం 4.30 లక్షల మంది విదేశీ విద్యార్థులు చదువుతుండగా భారతీయులు 30 వేల మంది ఉన్నారని పేర్కొన్నారు.

 
Comments Off on మన విద్యార్థులకు రూ.10 కోట్ల ఉపకారవేతనాలు

Posted by on February 5, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: