RSS

విడివిడిగా కంటే… కలిసి చదివే బడులే మేలు!

05 Feb

వాషింగ్టన్: బాలురు, బాలికలకు విడివిడిగా పాఠశాలలు ఉండటం వల్ల ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనమేదీ ఉండదు. ముఖ్యంగా కో-ఎడ్యుకేషన్ పాఠశాలలతో పోల్చి చూస్తే…. ఈ విడివిడి విద్యాలయాల వల్ల సమకూరుతున్న లాభాలేమీ లేవని వెల్లడైనట్లు పరిశోధకులు ఫిబ్రవరి 3న తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పదిలక్షల 60 వేలకు పైగా విద్యార్థినీ విద్యార్థులపై అధ్యయనం నిర్వహించామన్నారు. అత్యంత విస్తృతంగా సమాచారాన్ని సేకరించి….. క్రోడీకరించి విశ్లేషించినట్లు వారు తెలిపారు. చదువు విషయంలో కానీ… ఇతరత్రా ప్రవర్తనా పరమైన అంశాల దృష్ట్యా కానీ కో-ఎడ్యుకేషన్ బడుల్లో చదువుకున్న వారితో పోలిస్తే…ఇలా విడివిడిగా ప్రత్యేకించిన పాఠశాలల్లో విద్యనభ్యసించిన వారిలో చెప్పుకోదగిన అంశాలేవీ గోచరించలేదని అన్నారు.

 
Comments Off on విడివిడిగా కంటే… కలిసి చదివే బడులే మేలు!

Posted by on February 5, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: