RSS

Daily Archives: February 8, 2014

నెలాఖరులో టెట్?


నెలాఖరులో టెట్?
ఈనాడు – హైదరాబాద్: ఫిబ్రవరి 9న వాయిదాపడిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఫిబ్రవరి 27 లేదా 28వ తేదీల్లో నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఎన్నికల ప్రకటనకు ఆటంకం లేకుండా దీన్ని నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. గతేడాది నుంచీ ఈ పరీక్ష వాయిదాలు పడుతూ వస్తుండటంతో ఉద్యోగార్థులు సతమతమవుతున్నారు.

Advertisements
 
Comments Off on నెలాఖరులో టెట్?

Posted by on February 8, 2014 in Uncategorized

 

ఏపీ సెట్‌లో 6.35 శాతం మంది ఉత్తీర్ణత


హైదరాబాద్, న్యూస్‌టుడే: ఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సెట్ ఛైర్మన్ ప్రొఫెసర్ శిరసాని సత్యనారాయణ, సభ్య కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి ఓయూలో ఫిబ్రవరి 8న ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 27 విభాగాలకు పరీక్షలు నిర్వహించగా… 6.35 శాతం మంది అభ్యర్థులు అర్హత పొందారు. రాష్ట్రవ్యాప్తంగా 1,26,808 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా… 98,565 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,267 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జనరల్ విభాగంలో 3,249 మంది, బీసీ విభాగంలో 1904, ఎస్సీ విభాగంలో 840, ఎస్టీ విభాగంలో 163, పీహెచ్‌సీ విభాగంలో 111 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఉత్తీర్ణుల్లో 4605 మంది పురుషులు, 1662 మంది మహిళలు ఉన్నారు. ఫలితాలను ఓయూ, ఏపీ సెట్ వెబ్‌సైట్లలో పొందుపరిచారు.

 
Comments Off on ఏపీ సెట్‌లో 6.35 శాతం మంది ఉత్తీర్ణత

Posted by on February 8, 2014 in Uncategorized

 

ఉన్నత విద్యలో ప్రమాణాలు అధమం


ఉన్నత విద్యలో ప్రమాణాలు అధమం
* రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు
ముంబయి: ప్రపంచంలోని 200 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో భారతదేశంలోని ఒక్క ఉన్నత విద్యాసంస్థ కూడా లేకపోవడం శోచనీయమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. తెలివైన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇక్కడి విద్యావ్యవస్థలో ఉండేలా చూడాల్సిన అవసరముందని ఆయన సూచించారు. ముంబయిలోని కిషన్‌చంద్ చెల్లారం ఆర్ట్స్, కామర్స్, సైన్స్ కళాశాల (కేసీ కాలేజీ) వజ్రోత్సవాలను ప్రారంభించిన సందర్భంగా ఫిబ్రవరి 8న ఆయన మాట్లాడారు. ‘ఇక్కడ ప్రతిభ లేదన్న మాటే లేదు.. అమర్త్యసేన్, హరగోవింద్ ఖొరానా, చంద్రశేఖర్, వెంకటరామన్ లాంటి నోబెల్ బహుమతి గ్రహీతలు భారతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నవారేనని.. కానీ దురదృష్టవశాత్తు వారు విదేశీ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నప్పుడు నోబెల్ పురస్కారాలకు ఎంపికయ్యారని’ అన్నారు. దేశంలోని చాలా విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు అత్యల్ప స్థాయిలో ఉండటంపై ప్రణబ్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 650 విశ్వవిద్యాలయాలు, 33 వేల కళాశాలలు ఉన్నాయని… భారత విద్యావ్యవస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్దదని ఆయన గుర్తు చేశారు. వివిధ కోర్సుల్లో చేరే 18 నుంచి 24 ఏళ్ల వయస్కుల శాతం అమెరికాలో 34, జర్మనీలో 21 ఉండగా మన దేశంలో మాత్రం అది కేవలం 7 శాతమేనని వెల్లడించారు. ఏడు శతాబ్దాల కిందట ఉన్నత విద్యకు భారతదేశం చిరునామాగా ఉండేదని, ఆ వైభవం మళ్లీ సాధించాలని అన్నారు. ఈ ఉత్సవాల్లో మహారాష్ట్ర గవర్నర్ శంకరనారాయణ్, ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్, నటుడు అమితాబ్ బచ్చన్, రిలయన్స్ అడాగ్ ఛైర్మన్ అనిల్ అంబానీ పాల్గొన్నారు. కేసీ కాలేజిలోనే చదివిన అనిల్ అంబానీ అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. తన పేరు చివరన ‘ని’ అని ఉండటంతో తనను అంతా సింధీగా భావించి ఆ భాషలో మాట్లాడేవారని చెప్పి నవ్వులు పూయించారు.

 
Comments Off on ఉన్నత విద్యలో ప్రమాణాలు అధమం

Posted by on February 8, 2014 in Uncategorized

 

అవశేష ఆంధ్రప్రదేశ్‌కు… జాతీయ స్థాయి విద్యా సంస్థలు


ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు సవరణల్లో కీలక నిర్ణయాలు చోటుచేసుకున్నాయి. బిల్లులోని 13వ షెడ్యూల్‌లో సవరణల్లో భాగంగా కొన్ని అంశాలను కేంద్రం కొత్తగా చేర్చింది. విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్కటి చొప్పున ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌, ఐఐఐటీ వంటి జాతీయస్థాయి విద్యా సంస్థలతో పాటు కేంద్రీయ, పెట్రోలియం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ‘ఎయిమ్స్‌’ రీతిలో సూపర్‌ స్పెషాలిటీ బోధనాసుపత్రిని నెలకొల్పుతామంది. అవశేష ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ విపత్తుల నిర్వహణ కేంద్రం (ఎన్‌ఐడీఎం), గిరిజన విశ్వవిద్యాలయాలను నెలకొల్పుతామనీ… తెలంగాణ రాష్ట్రంలో గిరిజన, ఉద్యాన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది.

 
Comments Off on అవశేష ఆంధ్రప్రదేశ్‌కు… జాతీయ స్థాయి విద్యా సంస్థలు

Posted by on February 8, 2014 in Uncategorized

 

A.P. State Eligibility Test(AP – SET) press note


APSET-2013 Press Note-February

 
Comments Off on A.P. State Eligibility Test(AP – SET) press note

Posted by on February 8, 2014 in Uncategorized

 

A.P. State Eligibility Test(AP – SET) cut off marks


APSET-2013 Results cut off

 
Comments Off on A.P. State Eligibility Test(AP – SET) cut off marks

Posted by on February 8, 2014 in Uncategorized

 

A.P. State Eligibility Test(AP – SET) results are out


APSET-2013 Results

 
Comments Off on A.P. State Eligibility Test(AP – SET) results are out

Posted by on February 8, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: