RSS

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలి

08 Feb

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలి
* ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన బీసీ సంక్షేమ సంఘం
హైదరాబాద్, న్యూస్‌టుడే: ఆర్థికశాఖ అనుమతి ఇచ్చినా 65 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయకుండా రాష్ట్ర విభజనను సాకుగా చూపుతూ సర్వీస్ కమిషన్ అధికారులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. వారం రోజుల్లో నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న పలువురు నిరుద్యోగులు నాంపల్లిలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన తర్వాత కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయకుండా 25లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన అంశంతో గ్రూప్-1 తప్ప మిగతా ఉద్యోగాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

Advertisements
 
Comments Off on ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలి

Posted by on February 8, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: