RSS

మరో 15800 ఎంబీబీఎస్ సీట్లు

08 Feb

మరో 15800 ఎంబీబీఎస్ సీట్లు

* ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: దేశంలో ప్రతీ 1700 మంది జనాభాకు అర్హులైన వైద్యులు ఒక్కరు చొప్పున మాత్రమే ఉన్నారని, అందుకే కొత్తగా మరో 15,800 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించామని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 7న లోక్‌సభకు తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యమంత్రి గులాంనబీ ఆజాద్ లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. ప్రణాళికా సంఘానికి సమర్పించిన ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ప్రకారం 12, 13 పంచవర్ష ప్రణాళికల కాలంలో దేశవ్యాప్తంగా మరో 187 వైద్య కళాశాలలు వెనుకబడిన జిల్లాల్లో రావాల్సి ఉందన్నారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రస్తుతం ఉన్న విద్యార్థి-అధ్యాపకుల నిష్పత్తిని సడలించాల్సి ఉందని చెప్పారు. కళాశాల స్థలం, పడకల సంఖ్య, కనీస రోగుల సంఖ్య, గరిష్ఠ రోగుల పరిమితి తదితర నిబంధనలూ సడలిస్తేనే కొత్త కళాశాలలు సాధ్యపడతాయని అన్నారు. స్థలం కొరతను అధిగమించేందుకు ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలలకు పది కిలోమీటర్ల లోపు దూరంలో కళాశాల అనుబంధ ప్రాంగణాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామని తెలిపారు.

 
Comments Off on మరో 15800 ఎంబీబీఎస్ సీట్లు

Posted by on February 8, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: