RSS

వీఆర్వోల వేతనం పెంచుతాం: రఘువీరారెడ్డి

08 Feb

హైదరాబాద్, న్యూస్‌టుడే: వీఆర్వోలకు త్వరలోనే జూనియర్ అసిస్టెంట్ హోదాను కల్పిస్తూ రూ.17 వేల వేతనం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 7న ఇక్కడ తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం 2014 దైనందిని ఆవిష్కరణ సభ నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెండాల్య విజయ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. త్వరలోనే వీఆర్వోలకు ట్యాబ్లెట్లు, సీయూజీ సెల్‌ఫోన్లను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 25న మరో 6 వేల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నామని మంత్రి పేర్కొన్నారు.

 
Comments Off on వీఆర్వోల వేతనం పెంచుతాం: రఘువీరారెడ్డి

Posted by on February 8, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: