RSS

Daily Archives: February 13, 2014

విద్యార్థినుల భద్రతకు చైతన్య కేంద్రం ఏర్పాటు చేయాలి


* టాస్క్‌ఫోర్స్‌ నివేదిక
న్యూఢిల్లీ: యూజీసీ పరిధిలో లింగ చైతన్య కేంద్రం (జెండర్‌ సెన్సిటైజేషన్‌ యూనిట్‌) ఏర్పాటు చేయాలని.. కళాశాలలు, విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో మహిళలకు భద్రతపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ గట్టిగా సూచించింది. ”లింగ పరమైన హింస, వేధింపుల నివారణకు కళాశాలలు, వర్సిటీలు తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ కేంద్రం సహాయసహకారాలు అందిస్తుంది” అని టాస్క్‌ఫోర్స్‌ తన నివేదికలో పేర్కొంది. యూజీసీ ఏర్పాటు చేసిన ఈ టాస్క్‌ఫోర్స్‌ ‘సాక్ష్యం’ పేరుతో తన నివేదికను ఫిబ్రవ‌రి 12న‌ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ఎంఎం పల్లంరాజుకు అందజేసింది. దీంతో పాటు పూర్తిస్థాయిలో కౌన్సెలింగ్‌ సేవలు, ప్రాంగణాల్లో విద్యుత్‌ దీపాలు, ప్రజా రవాణా వ్యవస్థలో మెరుగైన టాయిలెట్‌ సౌకర్యం, ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థినులకు హాస్టల్‌ సౌకర్యం కల్పించాలని తన సూచనల్లో తెలిపింది.

Advertisements
 
Comments Off on విద్యార్థినుల భద్రతకు చైతన్య కేంద్రం ఏర్పాటు చేయాలి

Posted by on February 13, 2014 in Uncategorized

 

ఆర్‌యూ ఆచార్యుల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల


కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న ఆచార్యుల పోస్టుల భర్తీకి వర్సిటీ వీసీ ఆచార్య కృష్ణనాయక్ ఫిబ్రవరి 13న ప్రకటన విడుదల చేశారు. ఆంగ్లం, గణితం, ఎంబీఏ, కంప్యూటర్ సైన్స్, బోటనీ, జువాలజీ, ఎడ్యుకేషన్ లలో ఒక్కో దానికి ఏడేసి చొప్పున మొత్తం 49 ఆచార్యుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 22 లోగా దరఖాస్తు చేయాలని, ఇతర వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.

 
Comments Off on ఆర్‌యూ ఆచార్యుల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల

Posted by on February 13, 2014 in Uncategorized

 

టెట్…ఇప్పట్లో కష్టమే!


టెట్…ఇప్పట్లో కష్టమే!

ఈనాడు-హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడంలేదు. ఉద్యోగుల సమ్మె కారణంగా ఈ నెల 9వ తేదీన జరగాల్సిన టెట్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. 9కి బదులు ఈ నెలాఖరులోగా టెట్ నిర్వహించాలని భావించినా అందుకు అనుకూలమైన వాతావరణం కనిపించడంలేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరీక్ష నిర్వహణకు అవసరమైన సమయాన్ని ఇకపై వెచ్చించడం కష్టమని వ్యాఖ్యానిస్తున్నాయి. డీఎస్సీ-2014 జారీచేసే అవకాశాలూ లేనందున టెట్ నిర్వహణకు కాస్త ప్రాధాన్యం తగ్గింది. టెట్‌లో అర్హత సాధించిన వారికి ఉపాధ్యాయ నియామకాల్లో తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డీఎస్సీ జారీచేసే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు. సుమారు 4.5 లక్షల మంది టెట్ రాసేందుకు దరఖాస్తు చేయగా విద్యాశాఖ ఖజానాకు పది కోట్ల రూపాయల వరకు చేరింది. ప్రస్తుత పరిస్థితులనుబట్టి ఎన్నికల అనంతరమే టెట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 
Comments Off on టెట్…ఇప్పట్లో కష్టమే!

Posted by on February 13, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: