RSS

Daily Archives: February 14, 2014

తాత్కాలిక నియామకాలొద్దు


తాత్కాలిక నియామకాలొద్దు
* దిగువ కోర్టులకు సుప్రీం సూచన
న్యూఢిల్లీ: నిబంధనలను అనుసరించి శాశ్వత ప్రాతిపదికన మాత్రమే సిబ్బందిని నియమించుకోవాలని, తాత్కాలిక విధానంలో నియామకాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు తన పరిధిలోని అన్ని దిగువ కోర్టులకూ సూచించింది. ఈ మేరకు జస్టిస్‌ బి.ఎస్‌.చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఫిబ్రవరి 13న ఆదేశాలు జారీ చేసింది. క్లాస్‌-4, క్లాస్‌-3, క్లాస్‌-2 లేదా మరే ఉద్యోగాల విషయంలోనైనా ఇదే విధానాన్నే అనుసరించాలని స్పష్టం చేసింది. ‘సౌలభ్యం కోసం తాత్కాలిక, రోజువారీ విధానంలో సిబ్బందిని నియమిస్తున్నారు. తర్వాత వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తున్నారు. దీంతో నియామకాలకు సంబంధించి రూపొందించిన విధానాలు, చట్టాలు ప్రశ్నార్థకమవుతున్నాయి. అందరికీ సమానావకాశాలు దక్కాలంటే, నిబంధనల ప్రకారం శాశ్వత ప్రాతిపదికన మాత్రమే నియామకాలు చేపట్టాలి. ఇందుకు సంబంధించి కనీసం రెండు పత్రికల్లో ప్రకటనలివ్వాలి. అందులో ఒకటి సంబంధిత రాష్ట్రంలో అధిక సర్క్యులేషన్‌ ఉన్న స్థానిక భాషా పత్రిక అయి ఉండాలి’ అని పేర్కొంది.

Advertisements
 
1 Comment

Posted by on February 14, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: