RSS

ఎయిమ్స్‌ ఎంబీబీఎస్‌ ప్రవేశ ప్రక‌ట‌న విడుద‌ల‌

16 Feb

ఎయిమ్స్‌ ఎంబీబీఎస్‌ ప్రవేశ ప్రక‌ట‌న విడుద‌ల‌

* 17 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌
* జూన్ 1న ప్రవేశ‌ప‌రీక్ష
న్యూఢిల్లీ: దేశ రాజ‌ధానిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌)తో పాటు పాట్నా, భోపాల్‌, జోథ్‌పూర్‌, భువ‌నేశ్వర్‌, రుషికేష్‌, రాయ‌పూర్‌లోని ఎయిమ్స్‌ల్లో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి ప్రక‌ట‌న విడుద‌లైంది. దేశ‌వ్యాప్తంగా జూన్ 1న ప్రవేశ ప‌రీక్ష ఉంటుంద‌ని న్యూఢిల్లీ ఎయిమ్స్ ప‌రీక్షల స‌హాయ నియంత్రాణాధికారి తెలిపారు. ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీ స‌బ్జెక్టులతో ఇంట‌ర్ 60 శాతం (ఎస్సీ, ఎస్టీల‌కు 50%) మార్కుల‌తో ఉత్తీర్ణులైన‌వారు, ప్రస్తుతం ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్సరం చ‌దువుతున్నవారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని సూచించారు. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 17 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ప్రాస్పెక్టస్‌, ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌, పూర్తి వివ‌రాల‌కు www.aiimsexams.org వెబ్‌సైట్ చూడ‌వ‌చ్చు.

 
Comments Off on ఎయిమ్స్‌ ఎంబీబీఎస్‌ ప్రవేశ ప్రక‌ట‌న విడుద‌ల‌

Posted by on February 16, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: