RSS

Daily Archives: February 17, 2014

Advertisement No. 2/2014


Advertisement No. 2_2014

Advertisements
 
1 Comment

Posted by on February 17, 2014 in Uncategorized

 

ఈ బ్యాంకు ఉద్యోగం ‘ప్రత్యేకం’


ఈ బ్యాంకు ఉద్యోగం ‘ప్రత్యేకం’

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అసోసియేట్‌ బ్యాంకుల్లో 393 పోస్టుల నియామక ప్రకటన వెలువడింది. డిగ్రీ, పీజీ విద్యార్హత; పని అనుభవం ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. నియమితులైతే రూ. 30,000 నుంచి రూ. 75,000 జీతభత్యాలు పొందే అద్భుత అవకాశం! మరి ఈ పోస్టుల రాతపరీక్షకు సంసిద్ధమయ్యేదెలాగో తెలుసుకుందామా?
స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. 2 గం. 15 నిమిషాల వ్యవధి. రెండు విభాగాల్లో 170 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉంటుంది.
పార్ట్‌-1: మొదటి విభాగంలో 120 ప్రశ్నలకు 120 మార్కులు. ఈ విభాగాన్ని 90 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాలి. ఇందులో వచ్చే మార్కులు క్వాలిఫయింగ్‌ మార్కులు మాత్రమే. వీటిని మెరిట్‌ ర్యాంకింగ్‌ మార్కులుగా పరిగణించరు. అభ్యర్ధులు ఎంచుకున్న పోస్టు ఆధారంగా ఇందులో ప్రశ్నలు వస్తాయి.
పార్ట్‌-2: రెండో విభాగంలో 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. 45 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి. ఇందులో ప్రొఫెషనల్‌ నాలెడ్జి సంబంధిత ప్రశ్నలుంటాయి. ఈ విభాగంలో వచ్చే మార్కులను మాత్రమే మెరిట్‌ ర్యాంకింగ్‌ మార్కులుగా భావిస్తారు.
పరీక్షా విధానం:
మేనేజర్‌ (లా), డెప్యూటీ మేనేజర్‌ (లా), అసిస్టెంట్‌ మేనేజర్‌ (లా) పోస్టులు


మేనేజర్‌ (అఫిషియల్‌ లాంగ్వేజ్‌) డెప్యూటీ మేనేజర్‌ (అఫిషియల్‌ లాంగ్వేజ్‌), అసిస్టెంట్‌ మేనేజర్‌ (అఫిషియల్‌ లాంగ్వేజ్‌) పోస్టులు


ఇతర పోస్టులకు


రీజనింగ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, క్యాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నల స్థాయి పీవో పరీక్ష మాదిరిగా ఉంటుంది. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలు అభ్యర్థులు ఎంచుకున్న పోస్టును బట్టి ఉంటాయి. ఈ ప్రశ్నల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. గ్రాడ్యుయేషన్‌ (లేదా) పోస్టు గ్రాడ్యుయేషన్‌లో చదువుకున్న సబ్జెక్టులపై మాత్రమే ప్రశ్నలు వస్తాయి. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌కు సంబంధించి వచ్చే 100 మార్కులు మెరిట్‌ ర్యాంకింగ్‌ మార్కులు కాబట్టి వీటిపై శ్రద్ధ అవసరం.
రీజనింగ్‌: ఈ విభాగంలో ముందస్తు ప్రణాళికతో మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి. అప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. 2012లో జరిగిన పరీక్షలో అనలిటికల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు ఎక్కువ వచ్చాయి. ఆన్‌లైన్‌ పరీక్ష విధానం కాబట్టి సాంకేతిక కారణాల వల్ల నాన్‌-వెర్బల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు రాలేదు.
అభ్యర్థులు నంబర్‌ సిస్టమ్‌, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై పట్టు సాధించాలి. అలాగే ఇంగ్లిష్‌ పదాలు, వాటి అర్థాలు తెలుసుకోవటం తప్పనిసరి. ప్రశ్నలు జనరల్‌ టాపిక్‌, కామన్‌సెన్స్‌, కాన్సెప్ట్‌కు సంబంధించి ఉంటాయి.
అనలిటికల్‌ రీజనింగ్‌లో స్టేట్‌మెంట్స్‌ కంక్లూజన్‌, స్టేట్‌మెంట్స్‌ అజంప్షన్స్‌, డెసిషన్‌ మేకింగ్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్‌, కాజ్‌ అండ్‌ ఎఫెక్ట్‌పై దృష్టి సారించాలి. ఈ ప్రశ్నలను సులువుగా చేయాలంటే సాధన తప్పనిసరి. వీటితో పాటుగా సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్‌, నంబర్‌ ర్యాంకింగ్‌, టైమ్‌ సీక్వెన్స్‌, కోడింగ్‌-డీకోడింగ్‌, క్లాసిఫికేషన్‌ ప్రశ్నలను కూడా అభ్యాసం చేయాలి. సరైన ప్రణాళిక సిద్ధం చేసుకొంటే రీజనింగ్‌ సులువుగానే సాధించవచ్చు.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ఈ విభాగంలోని ప్రశ్నలకు ఎక్కువ సమయం పడుతుంది. సింప్లిఫికేషన్‌ షార్ట్‌కట్‌ మెథడ్స్‌ నేర్చుకుంటే కాల్‌క్యులేషన్‌ వ్యవధి తగ్గిపోతుంది. సాంప్రదాయిక పద్ధతిలో ప్రశ్నలు సాధించడానికి ప్రయత్నం చేయకూడదు. వాస్తవికంగా ఆలోచిస్తూ స్వీడ్‌ మ్యాథ్స్‌ చిట్కా ఉపయోగిస్తే సమయం ఆదా అవుతుంది.
న్యూమరికల్‌ ఎబిలిటీలో ఘనాలు, ఘనమూలాలు, వర్గాలు, వర్గమూలాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. సమయం ఆదా అవ్వాలంటే సింప్లికేషన్‌ తక్కువ సమయంలో చేయాల్సిందే.
అరిథ్‌మెటిక్‌లో వ్యాపార గణిత సంబంధిత అంశాలైన శాతాలు, సరాసరి, నిష్పత్తి- అనుపాతం, లాభనష్టాలు, క.సా.గు., గ.సా.భా., వయసులు, కాలం-పని, కాలం-దూరం, రైళ్లు, చక్రవడ్డీ-బారువడ్డీ సంబంధిత ప్రశ్నలు వీలైనన్ని అభ్యాసం చేయాలి. క్షేత్రగణిత (ఘనపరిమాణం, వైశాల్యాల) సంబంధిత ఫార్ములాలను ఒక దగ్గర రాసిపెట్టుకుని రోజూ మననం చేసుకొంటే గుర్తుంటాయి.
డేటా ఎనాలసిస్‌పై ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. సరాసరి, శాతాలు, నిష్పత్తులపై మంచి పట్టు ఉండాలి. పైచార్ట్‌, వెన్‌-డయాగ్రమ్‌, చార్టులు, టేబుల్స్‌, గ్రాఫ్స్‌, బార్‌చార్టుల్లోని సమాచారం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. వీలైనంతవరకు మనసులోనే లెక్కలు చేస్తే సమయం ఆదా అవుతుంది.
ఇంగ్లిష్‌: Fill inthe blanks, Vocabulary, synonyms, Antonyms సంబంధిత ప్రశ్నలు వస్తాయి. Error Location, Sentence arrangement, ప్రశ్నలోఉన్న పదానికి దగ్గర అర్థం ఉన్న పదాలనూ, వ్యతిరేక పదాలనూ కనుక్కోవటం, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌… వీటిపై ప్రశ్నలు వస్తాయి. ఆంగ్ల దినపత్రిక చదువుతూ రోజూ 10-20 పదాలకు అర్థాలు, వ్యతిరేకపదాలు నేర్చుకోవటం అలవాటు చేసుకోవాలి. ఈ విభాగాన్ని తక్కువ సమయంలో పూర్తిచేయగలిగితే మిగిలిన వాటిపై శ్రద్ధ చూపించవచ్చు.
ఆన్‌లైన్‌ పరీక్ష: IBPS, IBPS-RRB పరీక్షల మాదిరిగానే ఎస్‌బీఐ కూడా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తోంది. 2012 సంవత్సరంలో ఎస్‌బీఐ జరిపిన ఈ పరీక్ష కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించారు. పరీక్ష జరిగే విధానం ఐబీపీఎస్‌ ఆన్‌లైన్‌ పరీక్షకు అద్దంపట్టేలా ఉంటుంది. ఆన్‌లైన్‌ తీరుకు అలవాటు పడాలంటే ఒకచేతిలో పెన్నుతో రాసుకుంటూ, రెండోచేతితో మౌస్‌ ఆపరేట్‌ చేయటం సాధన చేయాలి. జవాబులను పెట్టేసమయంలో కేవలం మౌస్‌తో నేరుగా పెట్టవచ్చు కాబట్టి సమయం వృథా అవ్వదు. కిందున్న వెబ్‌లింకు ద్వారా నమూనా పేపర్‌ పొందవచ్చు.
www.tcsion.com/EForms/Mock/Template/index.html?167@@99
ఈపేపర్‌ ఫైనల్‌ పేపర్‌ మాదిరిగానే ఉంటుంది.
ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌: ఎంచుకున్న పోస్టును బట్టి ఈ విభాగంలో ప్రశ్నలు వస్తాయి. ఉద్యోగం రావాలంటే ఈ విభాగం కీలకమని గుర్తించి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
సిస్టమ్‌ ఆఫీసర్‌: ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ అయిన C,C++, JAVA మొదలైన వాటినుంచి ప్రశ్నలుంటాయి. బేసిక్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, డేటాస్ట్రక్చర్‌, కంప్యూటర్‌ ఆర్గనైజేషన్‌, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం , కంప్యూటర్‌ నెట్‌వర్క్‌, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ కాన్సెప్ట్‌, అల్గారిథమ్‌ ఎనాలిసిస్‌, సాప్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, వెబ్‌ టెక్నాలజీస్‌, ఇన్‌ఫర్‌మేషన్‌ సిస్టమ్‌, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్రశ్నలు రావొచ్చు.
‘లా’ ఆఫీసర్‌: బ్యాంకింగ్‌ రెగ్యులేటెడ్‌ లాస్‌, బ్యాంకింగ్‌ ఆపరేషనల్‌ లాస్‌, బ్యాంకింగ్‌ సెక్యురిటీ లాస్‌, బ్యాంకర్‌-కస్టమర్‌ రిలేషన్స్‌, కాంప్లియన్స్‌ అండ్‌ లీగల్‌ ఆస్పెక్ట్‌, నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, సెక్యూరిటీ టైప్స్‌, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ లోన్స్‌- అడ్వాన్స్‌, ఫైనాన్షియల్‌ ఎనాలిసిస్‌, ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌, ఎథిక్స్‌ అండ్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ఇన్‌బ్యాంక్‌ అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
స్టాటిస్టిషియన్‌: Uni-Variate డేటా, బై-వేరియేట్‌ డేటా, టైమ్‌ సిరీస్‌-ఫోర్‌కాస్టింగ్‌, శాంప్లింగ్‌ కాన్సెప్ట్‌, శాంప్లింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌, ఎస్టిమేషన్స్‌ థియరీ, సింపుల్‌ రిగ్రషన్‌, మల్టిపుల్‌ రిగ్రషన్‌, వేరియన్స్‌ ఎనాలిసిస్‌, బ్యాంకింగ్‌-ఇన్సూరెన్స్‌, ఫైనాన్షియల్‌ మార్కెట్‌, ఫారిన్‌ ఎక్స్చేంజ్‌, ఫోర్‌కాస్టింగ్‌ ఫోర్ట్‌పోలియో సంబంధిత అంశాలపై ప్రశ్నలు రావొచ్చు.
చార్టర్డ్‌ అకౌంటెంట్‌: అకౌంటింగ్‌ స్టాండర్స్‌, అకౌంటింగ్‌ గైడెన్స్‌ నోట్‌, ఫైనాన్షియల్‌ రిపోర్ట్‌ స్టాండర్డ్స్‌, ఇండియన్‌ అకౌంటింగ్‌ స్టాండర్స్‌, కార్పొరేట్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌, అకౌంటింగ్‌ అండ్‌ రిపోర్టింగ్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌, షేర్‌బేస్ట్‌ పేమెంట్‌, లయబిలిటీ వ్యాల్యూషన్‌, షేర్‌, బిజినెస్‌ వ్యాల్యూషన్‌, ఇన్‌ఫ్లేషన్‌ అకౌంటింగ్‌, ఇండియన్‌ కాపిటల్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, పారిన్‌ ఎక్స్చేంజ్‌, ఆడిటింగ్‌ వంటి అంశాలపై, CAలోని ఇతర అంశాలపై అవగాహన పొందాలి.

 

 
Comments Off on ఈ బ్యాంకు ఉద్యోగం ‘ప్రత్యేకం’

Posted by on February 17, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: