RSS

Daily Archives: February 19, 2014

తాత్కాలిక పోస్టులు మరో ఏడాది కొనసాగింపు


ఈనాడు-హైదరాబాద్: వివిధ శాఖల్లోని అవసరాల నిమిత్తం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పోస్టులు మరో ఏడాది పాటు కొనసాగనున్నాయి. ఇంతకు ముందటి ఉత్తర్వుల ప్రకారం ఈ పోస్టుల గడువు మార్చి 1వ తేదీ వరకు ఉంది. ఇప్పుడు ఈ గడువును 2015, ఫిబ్రవరి 28వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఫిబ్రవరి 19న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కొనసాగింపు ఏయే జీవోల ద్వారా ఏర్పాటు చేసిన పోస్టులకు వర్తించేది ఆర్థిక శాఖ తన తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది. భూ సేకరణ విభాగాలు, ప్రాజెక్టుల్లోని పోస్టులు, అవుటర్ రింగ్ రోడ్డు , భూ భారతి వంటివాటిలో స్వల్పకాల వ్యవధి కోసం ఏర్పాటు చేసిన పోస్టుల కొనసాగింపుపై మాత్రం ఆయా విభాగాలు ఆర్థిక శాఖకు ప్రత్యేకంగా ప్రతిపాదనలను పంపి ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది. అదే విధంగా శాసన సభ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక పోస్టులకూ ఇటువంటి ఆమోదం అవసరం. తాత్కాలిక పోస్టులతో పాటుగానే మంజూరు చేసిన పొరుగు సేవలు(అవుట్‌సోర్సింగ్), ఒప్పంద(కాంట్రాక్టు) ఉద్యోగుల పోస్టులకు తాజా పొడిగింపు వర్తించదు. వీటి అవసరం ఏమేరకు ఉన్నదీ తెలుపుతూ ఆయా శాఖలు ప్రత్యేకంగా ప్రతిపాదలను అందజేయాలి.

Advertisements
 
Comments Off on తాత్కాలిక పోస్టులు మరో ఏడాది కొనసాగింపు

Posted by on February 19, 2014 in Uncategorized

 

కేంద్రానికి ‘రూసా’ ప్రతిపాదనలు


ఈనాడు-హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద కొత్త విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు, ఇతర అవసరాల కోసం 2701 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల శాఖకు ఫిబ్రవరి 19న పంపింది. ఉన్నత విద్య అభివృద్ధి కోసం కేంద్రం రూసా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద కేటాయించే నిధుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 65:35 నిష్పత్తిలో భరించాలి. 11 విశ్వవిద్యాలయాలు, 12 నుంచి 15 ఇంజినీరింగ్ కళాశాలలు, మోడల్ డిగ్రీ కళాశాలలు, అధ్యాపకుల నియామకాలు, ఇతర అవసరాల కోసం ఉన్నత విద్యా శాఖ ద్వారా కేంద్ర మానవ వనరుల శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి వెల్లడించారు.

 
2 Comments

Posted by on February 19, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: