RSS

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో విద్యా శాఖ

25 Feb

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో విద్యా శాఖ
ఈనాడు-హైదరాబాద్: విద్యా శాఖ పనితీరును మెరుగుపరిచేందుకు, సమయాన్ని ఆదాచేసేందుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ ద్వారా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే ప్రక్రియ పూర్తికాబోతుంది. ఈ అంశానికి విద్యాశాఖ తగిన ప్రాధాన్యత ఇస్తోంది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల విషయంలో తరచూ అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈసాఫ్ట్‌వేర్‌లో ప్రతి ఉపాధ్యాయుడు వ్యక్తిగత వివరాలు నమోదుచేస్తారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయుల హాజరు వంటి వివరాలను దీనిద్వారా సమీక్షించేందుకు వీలుంటుందని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాణీమోహన్ ఫిబ్రవరి 24న వెల్లడించారు.

Advertisements
 
Comments Off on ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో విద్యా శాఖ

Posted by on February 25, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: