RSS

కళాశాలల్లో జంతు ప్రయోగాలపై నిషేధం

25 Feb

కళాశాలల్లో జంతు ప్రయోగాలపై నిషేధం!
న్యూఢిల్లీ: కళాశాలల్లోని జంతు, జీవశాస్త్ర విభాగాల్లో జంతువులను కోసి చేసే ప్రయోగాలను పూర్తిస్థాయిలో నిషేధించాలని యూజీసీ భావిస్తోంది. మూగజీవాల రక్షణ కోసం ఏర్పాటైన పెటా ఈ మేరకు వెల్లడించింది. జంతువుల పరిచ్ఛేదనం, వాటిపై ప్రయోగాలను నిలిపివేయాలని యూజీసీ రెండేళ్ల క్రితమే సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు విశ్వవిద్యాలయాలకు లేఖలు రాయాలని ఆ సంస్థ నిర్ణయించినట్లు పెటా పేర్కొంది. పెటాతోపాటు ఎంపీ మనేకా గాంధీ పలుమార్లు విజ్ఞప్తులు చేసిన అనంతరం యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కప్పలు, ఎలుకలు, చుంచులు, గినియా పందులు, కుందేళ్లను కోసి వాటి శరీర నిర్మాణాన్ని, పనితీరును తెలుసుకునే ప్రయోగాలు కళాశాలల్లో జంతుశాస్త్ర కోర్సుల్లో జరుగుతుంటాయి. వీటి స్థానంలో జంతురహితంగా కంప్యూటర్‌ స్టిమ్యులేషన్స్‌, సీడీలు, చిత్రాలు, పటాలు వంటి వాటిని వినియోగించి ప్రభావవంతంగా బోధన సాగించవచ్చని పెటా తదితర సంస్థలు చెబుతున్నాయి.

 
Comments Off on కళాశాలల్లో జంతు ప్రయోగాలపై నిషేధం

Posted by on February 25, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: