RSS

టెట్‌ ఇక లేనట్లే!

27 Feb

టెట్‌ ఇక లేనట్లే!

హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఇక లేనట్లేనని అధికారులు ఫిబ్రవరి 27న ధ్రువీకరించారు. వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తున్న నేపథ్యంలో టెట్‌ నిర్వహణ అసాధ్యమని అధికారులు తేల్చేశారు. అయితే నిరుద్యోగుల నుంచి టెట్‌ పరీక్ష రుసుము పేరిట వసూలు చేసిన సుమారు 10 కోట్ల రూపాయలతో రెండు రాష్ట్రాలు విభజించాక ఆయా ప్రాంతాల్లో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం ఆధారంగా టెట్‌ నిర్వహించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గత ఏడాది జులై 10న విడుదలైన టెట్‌ నోటిఫికేషన్‌కు సంబంధించి మూడుసార్లు పరీక్ష తేదీలు ఖరారై చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. చివరగా ఫిబ్రవరి 9న జరగాల్సిన టెట్‌ పరీక్ష ఏపీఎన్జీవోల సమ్మె కారణంగా వాయిదా పడింది. టెట్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మంది ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

Advertisements
 
Comments Off on టెట్‌ ఇక లేనట్లే!

Posted by on February 27, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: