RSS

Daily Archives: March 2, 2014

మే 7న ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష


నిమ్మకూరు (పామర్రురూరల్‌), న్యూస్‌టుడే: 2014-2015 సంవత్సరానికి సంబంధించిన ఏపీఆర్‌జేసీ కళాశాలల్లో ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం, నాగార్జున సాగర్‌, కర్నూలు సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు పరీక్షలు మే 7న ప్రతి జిల్లా కేంద్రంలోనూ జరుగుతాయని పరీక్షల జిల్లా సమన్వయ కర్త, ఏపీఆర్‌జేసీ నిమ్మకూరు ప్రిన్సిపల్‌ ఎన్‌.సీతాపతి మార్చి 1న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు ఫారాలు సంస్థలకు వచ్చి కొనుగోలు చేయనవసరం లేదని, ఆన్‌లైన్లో దరఖాస్తులు పూర్తిచేసి సమర్పించాలన్నారు. దరఖాస్తు ఫారాలు సమర్పించే తేదీల వివరాలు పైఅధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడిన అనంతరం తెలియజేస్తామన్నారు.

Advertisements
 
Comments Off on మే 7న ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష

Posted by on March 2, 2014 in Uncategorized

 

యువ ప్రతిభకు ప్రోత్సాహం తక్షణావసరం


 

* ‘భారతరత్నసీఎన్ఆర్.రావు

 

చండీగఢ్: భారతదేశం కనుక అత్యున్నత… అత్యుత్తమ స్థాయి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దాలనుకుంటే… తప్పనిసరిగా నాణ్యమైన విజ్ఞానశాస్త్ర పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలి అని ‘భారతరత్న’ ఫ్రొఫెసర్. సీఎన్ఆర్.రావు అభిప్రాయపడ్డారు. మార్చి 2న ఇక్కడ జరిగిన ఒక సదస్సులో ఆయన ఉపన్యసిస్తూ…. భారత దేశంలో సైన్స్‌ను మరింతగా అభివృద్ధి పరచాలన్నారు. ఇందుకు ప్రతిభావంతులైన యువతరాన్ని ప్రోత్సహించాలి. ప్రజ్ఞావంతులైన అధ్యాపకుల ద్వారానే ఇది సాధ్యమవుతుందని ప్రొ.రావు అభిప్రాయపడ్డారు. విలక్షణ వ్యక్తులే చిన్నచిన్న ప్రయోగశాలల్లో అద్భుతాలను ఆవిష్కరిస్తారు అన్నారు. మానవతా విలువలు…. ఉదారతస్వభావం, చక్కటి సంస్కారాలనేవి నాణ్యమైన ఫలితాలనిస్తాయని ఆయన అన్నారు.

 
Comments Off on యువ ప్రతిభకు ప్రోత్సాహం తక్షణావసరం

Posted by on March 2, 2014 in Uncategorized

 

10 నుంచి ఏపీసెట్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన


 

Verification of certificate-2014

 
Comments Off on 10 నుంచి ఏపీసెట్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

Posted by on March 2, 2014 in Uncategorized

 

‘లక్ష’ణమైన బహుమతి


న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 12వ తరగతిలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 200 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున రూ. 2 కోట్ల నగదు బహుమతులు అందజేసింది. కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు ఫిబ్రవరి 28న వీటిని ప్రదానం చేశారు. 12వ తరగతిలో సైన్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌, వొకేషనల్‌ కోర్సుల్లో ఒక్కో విభాగంలో 50 మంది చొప్పున అత్యధిక మార్కులు సాధించిన వారికి వీటిని అందజేశారు. ఉన్నత విద్య దిశగా విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు, మధ్యలోనే చదువు మానేయకుండా చూసేందుకు ఈ తరహా ప్రోత్సాహకాలు దోహదం చేస్తాయని పళ్లంరాజు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

 
Comments Off on ‘లక్ష’ణమైన బహుమతి

Posted by on March 2, 2014 in Uncategorized

 

మూడో తరగతి విద్యార్థుల్లో 30% మందికి లెక్కలు రావు


* ఎన్‌సీఈఆర్‌టీ
న్యూఢిల్లీ: మనదేశంలో మూడో తరగతి విద్యార్థుల్లో 66% మంది మాత్రమే లెక్కలకు సరైన సమాధానం చెబుతున్నట్టు ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన ‘జాతీయ ప్రగతి గణన’ నివేదిక పేర్కొంది. అయితే ఇంకా 30% మంది విద్యార్థులు తేలికైన గుణకారాలు సైతం చేయలేకపోతున్నారని వెల్లడించింది. భాషా సంబంధ ప్రశ్నలకు 64% మంది సమాధానాలు చెబుతుండగా.. 70% మంది తేలికైన గుణకారాలు చేయగలుగుతున్నారంది. 65% మంది పిల్లలు విని, స్పందించగలుగుతున్నారని.. చూపించిన చిత్రాలను 86% మంది గుర్తించగలుగుతున్నారని తెలిపింది. ఈ నివేదికను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు ఫిబ్రవరి 28న విడుదల చేశారు.

 
Comments Off on మూడో తరగతి విద్యార్థుల్లో 30% మందికి లెక్కలు రావు

Posted by on March 2, 2014 in Uncategorized

 

ప్రోత్సాహం లేకనే విదేశాలకు వలస


* డీజీపీ బి.ప్రసాదరావు
కర్నూలు విద్య, న్యూస్‌టుడే: ఆలోచన విధానాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను ఆవిష్కరించవచ్చని డీజీపీ బి.ప్రసాదరావు అన్నారు. ఫిబ్రవరి 28న రాయలసీమ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జాతీయ సైన్స్‌ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అధ్యాపకులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో వనరులు అపారంగా ఉన్నాయని, యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నైపుణ్యం కలిగిన యువ శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారని, ప్రోత్సాహం లేకనే వారు విదేశాలకు వెళుతున్నారని అన్నారు. తాను ఇంటర్‌ వరకు తెలుగు మాధ్యమంలోనే చుదువుకున్నానని, పట్టుదలతో ఆంగ్లంపై పట్టు సాధించానని, 11వేల ఆంగ్ల పదాలకు అర్థాలు తెలుసుకొని గుర్తుపెట్టుకున్నానని చెప్పారు. రాయలసీమ విశ్వవిద్యాలయం ఉపకులపతి కృష్ణనాయక్‌, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఆర్‌.రామకృష్ణారెడ్డి, ఆర్‌యూ రిజిస్ట్రార్‌ ఆచార్య డి.పుణ్యశేషుడు, లైఫ్‌ సైన్సెస్‌ డీన్‌ ఆచార్య ఎ.ఎ.చారి కార్యక్రమంలో ప్రసంగించారు.

 
Comments Off on ప్రోత్సాహం లేకనే విదేశాలకు వలస

Posted by on March 2, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: