RSS

‘సివిల్స్’ వయోపరిమితి పెంపుపై గందరగోళం

06 Mar

ఈనాడు-హైదరాబాద్: సివిల్స్ అభ్యర్థుల డిమాండ్లను అనుసరించి కేంద్ర ప్రభుత్వం వయో పరిమితిని పెంచినప్పటికీ కటాఫ్ ‘తేదీ’పై స్పష్టత ఇవ్వనందున గందరగోళం నెలకొంది. సివిల్స్ పరీక్షల్లో 2013 నుంచి పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొచ్చినందున చివరి అవకాశంలో ఉన్న వారికి మరో రెండేళ్లపాటు రాసే వెసులుబాటు పెంచేందుకు వీలుగా వయోపరిమితిని పెంచాలని అభ్యర్థులు కేంద్రాన్ని డిమాండ్‌చేశారు. దీనిపై ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ జోక్యం చేసుకోవడంతో వయోపరిమితిని రెండేళ్ల వరకు పెంచేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. దీనివల్ల జనరల్ కేటగిరీలో వయోపరిమితిని 30 నుంచి 32 సంవత్సరాలకు పెంచారు. ఇదే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వెసులుబాటు లభించింది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించినప్పటికీ వయోపరిమితిని రెండేళ్ల వరకు పెంచడంలో కటాఫ్ తేదీ గురించి పేర్కొనలేదు. ఈ నిర్ణయం తాత్కాలికమా…శాశ్వతమా అన్న దానిపైనా స్పష్టత ఇవ్వలేదు. దీనివల్ల అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు.

 
Comments Off on ‘సివిల్స్’ వయోపరిమితి పెంపుపై గందరగోళం

Posted by on March 6, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: