RSS

విలువలు నేర్పే పాఠాలు రావాలి

10 Mar

కడప, న్యూస్‌టుడే: పిల్లలకు విలువల ఆధారిత విద్యా విధానం అమలు కోసం పాఠ్యాంశాల్లో మార్పులు రావాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. కడప యోగివేమన విశ్వవిద్యాలయం ఎనిమిదో వార్షికోత్సవం, స్నాతకోత్తర కళాశాల వార్షికోత్సవాల ఉమ్మడి వేదికపై మార్చి 9న రాత్రి ఆయన ప్రసంగించారు.

‘మేం చదువుకునే రోజుల్లో పాఠాలన్నీ నీతిని, మంచి నడవడికను అలవడేలా చేసేవి. ఇపుడు ఆ పరిస్థితి కానరాదు. ఎందుకిలా మార్చేశారో అవగతం కాదు. వైద్యులు, ఇంజినీర్లుగా బాలలు ఎదగాలని తల్లిదండ్రులు కలలుగంటారు. సమాజ ఉపయుక్త సంఘ సంస్కర్తలుగా వారు సేవలందించాలని ఎవరూ ఇష్టపడర’ని పేర్కొన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్‌ మాట్లాడుతూ పారదర్శక- ప్రభావవంత పాలనతో విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధానాచార్యులు ధనుంజయనాయుడు, కులసచివులు ఆచార్య వాసంతి, ప్రొద్దుటూరు యోగివేమన విశ్వవిద్యాలయ ఇంజినీరింగు కళాశాల ప్రధానాచార్యుడు జయచంద్రారెడ్డి తదితరులు మాట్లాడారు.

 
Comments Off on విలువలు నేర్పే పాఠాలు రావాలి

Posted by on March 10, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: