RSS

‘టెట్’కు ఏర్పాట్లు పూర్తి

15 Mar

‘టెట్’కు ఏర్పాట్లు పూర్తి

ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16న జరగనుంది. పేపర్-1ను 56,202 మంది, పేపర్-2ను 3,86,367 మంది రాయబోతున్నారు. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 ఉంటుంది. రెండు పరీక్షలనూ రాసే అభ్యర్థులు 7,333 మంది వరకు ఉన్నారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా పేపర్-1కు 276, పేపర్-2కు 693 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టెట్ నిర్వహణాధికారి, విద్యాశాఖ అదనపు సంచాలకుడు సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి; తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రిలో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల జిల్లా కేంద్రాల్లోనే ఈ పరీక్షలు జరగబోతున్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 31వేల మంది వరకు రాస్తుండగా తక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో రాయబోతున్నారు. ప్రకటించిన సమయం కంటే ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించరు. గత సెప్టెంబరు నుంచి ఈ పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది.

 
Comments Off on ‘టెట్’కు ఏర్పాట్లు పూర్తి

Posted by on March 15, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: