RSS

ప్రశాంతంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష

16 Mar

ప్రశాంతంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష
హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఉదయం 9.30గంటలకు ప్రారంభమైన పేపర్‌-1 పరీక్షను 56 వేల 202 మంది డీఈడీ అభ్యర్థులు రాస్తున్నారు. బీఈడీ అభ్యర్థులకు మధ్యాహ్నం నిర్వహించే పేపర్‌-2 పరీక్షకు 3లక్షల 86వేల 367 మంది హాజరవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా 1969 కేంద్రాల్లో టెట్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. మార్చి 18న ప్రిలిమినరీ ‘కీ’ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక నిమిషం ఆలస్యం నిబంధన టెట్‌కు విధించడంతో రాష్ట్రంలో సుమారు 30 మంది వరకు విద్యార్థులు ఈ పరీక్ష రాసే అవకాశం కోల్పోయినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌: మార్చి 16 ఉదయం జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ పేపర్‌ – 1కి 89 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. తిరుపతిలో టెట్‌ రాస్తూ పట్టుబడిన ఇద్దరు ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.

 
Comments Off on ప్రశాంతంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష

Posted by on March 16, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: