RSS

మారనున్న డీఎడ్ పాఠ్య ప్రణాళిక

20 Mar

మారనున్న డీఎడ్ పాఠ్య ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్: డీఎడ్ (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) పాఠ్య ప్రణాళిక మారనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరం పాఠ్య ప్రణాళిక మారుతుంది. 2015-16లో ద్వితీయ సంవత్సరం కోర్సులో మార్పులు తెస్తారు. ఒకటి నుంచి పదోతరగతి వరకు దశలవారీగా పాఠ్య ప్రణాళికను మార్చిన రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ)… ప్రస్తుతం డీఎడ్‌పై దృష్టి సారించింది. ఉపాధ్యాయ విద్యలో ఈ కోర్సుకున్న ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని పాఠ్య ప్రణాళికలో మార్పులు చేస్తున్నట్లు ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకులు గోపాలరెడ్డి ఈనాడుతో చెప్పారు.
బీఈడీ కాలపరిమితి పెంపు ప్రతిపాదనలు…
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కాలపరిమితిని ఏడాది కాకుండా, ఇంకా పెంచాల్సి ఉందని ఉపాధ్యాయ విద్య ప్రమాణాలపై అధ్యయనం చేసిన జస్టిస్ వర్మ కమిటీ జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి (ఎన్‌సీఈఆర్‌టీ)కి ప్రతిపాదించింది. ఏడాదిలో కేవలం తొమ్మిది నెలలు మాత్రమే బీఈడీ బోధన జరుగుతున్నందున… శిక్షణార్థులు ఉపాధ్యాయ విద్యపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోలేకపోతున్నారని పేర్కొంది. సాధారణ డిగ్రీ కాలపరిమితిని మరో ఏడాది పెంచి, ఆ సమయంలో బీఈడీ శిక్షణ ఇవ్వడం… బీఈడీ కోర్సును రెండేళ్లు చేయడం లేదా డీఎడ్‌కు అనుబంధంగా బీఈడీని కలపడం వంటి ప్రత్యామ్నాయాలపై అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఓ నిర్ణయం వెలువడేందుకు ఏడాది వరకు సమయం పట్టే అవకాశముంది.

 
Comments Off on మారనున్న డీఎడ్ పాఠ్య ప్రణాళిక

Posted by on March 20, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: