RSS

29 నుంచి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు

27 Mar

29 నుంచి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు

* ముగిసిన ఇంటర్ ప్రధాన పరీక్షలు
ఈనాడు-హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలకు ఇంటర్ విద్యా మండలి వేసవి సెలవులను ప్రకటించింది. మార్చి 29 నుంచి జూన్ 3వ తేదీ వరకు కళాశాలలు పనిచేయవు. జూన్ 4వ తేదీ నుంచి కళాశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఈ నిర్ణయం ప్రభుత్వ కళాశాలలతోపాటు ప్రైవేట్ కళాశాలలకూ వర్తిస్తుంది. వేసవి సెలవుల సమయంలో కళాశాలలు తెరిచి తరగతులు నిర్వహిస్తే..కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ విద్యా మండలి మార్చి 26న ప్రకటించింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ప్రధానమైనవి మార్చి 26 (ద్వితీయ సంవత్సరం రసాయనశాస్త్రం)తో ముగిశాయి. మిగిలిన పరీక్షలు ఏప్రిల్ ఒకటో తేదీతో ముగియనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 19 లక్షల మంది వరకు విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందుకు 2661 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు.

 
Comments Off on 29 నుంచి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు

Posted by on March 27, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: