RSS

ఎంసెట్ మెడికల్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు

04 Apr

ఎంసెట్ మెడికల్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు

ఈనాడు-హైదరాబాద్: ఎంసెట్ మెడికల్ పరీక్ష రాసేందుకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందాయి. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 4తో ముగిసింది. ఎంసెట్ ఇంజినీరింగ్ రాసేందుకు 2,05,529 మంది, మెడికల్ పరీక్ష రాసేందుకు 1,07,749 మంది దరఖాస్తు చేశారు. ఇంజినీరింగ్, మెడికల్ రాసేందుకు దరఖాస్తుచేసిన వారు 1,712 మంది వరకు ఉన్నారు. దీంతో మెడికల్ పరీక్ష రాసే వారి సంఖ్య 1,09,461 కు చేరుకుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నందున ఈ సంఖ్య శనివారం నాటికి మరికొంత పెరగనుంది. ఎంసెట్ చర్రితలో మెడికల్‌కు అత్యధిక దరఖాస్తులు రావడం ఇదే తొలిసారని ఎంసెట్ కన్వీనర్ రమణారావు వెల్లడించారు. గతంలో 1,05,070 దరఖాస్తులు వచ్చాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే.. ఇంజినీరింగ్ పరీక్ష రాసేందుకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 15 వేల వరకు తగ్గినట్లు తెలుస్తోంది. అపరాధ రుసుముతో ఇంజినీరింగ్, మెడికల్‌లో 5000 వంతున దరఖాస్తులు పెరగడం ఆనవాయితీగా వస్తోంది. రూ.500, 1000, 5000, 10000 అపరాధ రుసుముతో చివరిగా మే 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. ఎంసెట్ మే 22వ తేదీన జరగనుంది.

 
Comments Off on ఎంసెట్ మెడికల్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు

Posted by on April 4, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: